Krishnam Raju Death: ప్రముఖ టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) మరణించారు. ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ(AIG) హాస్పటల్‌లో చికిత్స పొందుతూ.. తెల్లవారుజామున 3.25 గంటలకు చివరిశ్వాస విడిచారు. కృష్ణంరాజు కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటివలే చికత్స నిమిత్తం ఏఐజీ హాస్పటల్‌లో చేరారు. అయితే నిన్న రాత్రి చికిత్స పొందుతున్న సమంయంలో హఠాత్తుగా గుండె పోటు రావడంతో మరణించారని ఏఐజీ(AIG) వైద్యలు తెలిపారు. ఆయన మరణం వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.
ఆయన చెరగని ముద్రవేశారు: నందమూరి బాలకృష్ణ
కృష్ణంరాజు చనిపోయారనే వార్త తెలియగానే.. నందమూరి బాలకృష్ణ స్పందించారు. "మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసిందని.. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు చెరగని ముద్రవేశారని, విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని, ఇంతలోనే ఇలా మరణించడం చాలా బాధకరమరన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మీరు మా గుండెల్లో జీవిస్తూనే ఉంటారు: అనూష్క
కృష్ణంరాజు మరణవార్త పై ప్రముఖ నటి అనూష్క స్పందించారు. " మీరు మరణించినా.. మా హృదయాల్లో ఎప్పుడు జీవిస్తున్నే ఉంటారు" అంటూ అనూష్క ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమ ఓ గొప్ప హీరోను కోల్పోవడం చాలా బాధకరమని ఆమె తెలిపారు.
Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022
ఆయన మరణించడం చాలా బాధకరం: చింరంజీవి
చింరంజీవి కూడా కృష్ణంరాజు మరణవార్త పై స్పందించారు. " కృష్ణంరాజు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్న లా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారి తో నాటి 'మనవూరి పాండవులు' దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది." అంటూ చింరంజీవి దిగ్భ్రాంతి వక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022
కృష్ణంరాజు మరణ వార్తపై పవన్ కళ్యాణ్..
కృష్ణంరాజు మరణవార్తపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వక్తం చేశారు. " తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది." అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook