Krishna Vrinda Vihari Review: కృష్ణ వ్రింద విహారి సినిమా ఎలా ఉందంటే?

Krishna Vrinda Vihari Telugu Movie Review: లక్ష్య లాంటి సినిమాలతో డిజాస్టర్ అందుకున్న నాగశౌర్య సరైన కొట్టాలని ఉద్దేశంతో కృష్ణ వ్రింద విహారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 23, 2022, 12:42 PM IST
Krishna Vrinda Vihari Review: కృష్ణ వ్రింద విహారి సినిమా ఎలా ఉందంటే?

Krishna Vrinda Vihari Telugu Movie Review: చాలా కాలం నుండి సరైన హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు నాగశౌర్య. ఇప్పటికే లక్ష్య లాంటి సినిమాలతో డిజాస్టర్ అందుకున్న ఆయన సరైన కొట్టాలని ఉద్దేశంతో కృష్ణ వ్రింద విహారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మునుపెన్నడు నటించని ఒక బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో నటిస్తూ ఉండడంతో పాటు ఈ సినిమా కోసం మునుపెన్నడు చేయని పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్ తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడేలా చేసుకున్న ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడు అనేది సినిమా రివ్యూ లో చూద్దాం.

కృష్ణ వ్రింద విహారి కథ: 
పశ్చిమగోదావరి జిల్లా గోపవరం అగ్రహారంలో పుట్టిన  కృష్ణాచారి(నాగ శౌర్య) ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ లో అడుగు పెడతాడు. పుట్టినప్పటినుంచి మడి, ఆచారాలు అంటూ ఇప్పటికీ సంప్రదాయ బద్ధంగా బతికే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హైదరాబాద్ ఆఫీసులో ఎంటర్ అయిన తర్వాత ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన ప్రాజెక్ట్ టీం లీడర్ అని తెలిసినా సరే కష్టపడి ఆ అమ్మాయిని పడేసేందుకు ప్రయత్నం చేస్తాడు, చివరికి ఆ అమ్మాయి పేరు వ్రింద(షెర్లీ) అని తెలుస్తుంది కానీ ఆమె తనకు పిల్లలు పుట్టరు అని చెప్పి షాక్ ఇస్తుంది. అయినా సరే నేను ప్రేమించేది నిన్నే కానీ నీ పిల్లల్ని కాదు కదా అనే లాజిక్ తో ఆమెను వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతాడు. అయితే తన ఇంట్లో ఏర్పడిన ఒక అనుకోని ఇబ్బందితో తనకు పిల్లలు పుట్టరు, క్రికెట్ ఆడుతున్నప్పుడు తన మగతనం కోల్పోయానని తన బంధువైన డాక్టర్(వెన్నెల కిషోర్)తో అబద్ధం చెప్పిస్తాడు. వివాహం జరిగిన తర్వాత అంతా బాగానే ఉంటుంది అనుకున్న సమయంలో హైదరాబాద్ వస్తుంది కృష్ణాచారి తల్లి అమృతవల్లి(రాధికా శరత్ కుమార్) ఆ వచ్చిన తర్వాత అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. ఇంతలోనే అమృతవల్లికి తన కోడలు బృందా గురించి తెలియకూడని ఒక నిజం తెలుస్తుంది. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి? చివరికి కృష్ణ వ్రింద విడిపోయే పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? చివరికి వాళ్ళిద్దరూ కలుస్తారా? విడిపోతారా? అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత అబద్ధాల వల్ల అనేక ఇబ్బందులు పడటం అనే కాన్సెప్ట్ గతంలో అనేక సినిమాల్లో చూశాం. అందులో బ్రాహ్మణ కుర్రాడు పోష్ కల్చర్ అమ్మాయి అనే కాన్సెప్ట్ తో ఇటీవల అంటే సుందరానికి అనే సినిమాలో కూడా చూశాము. దాదాపుగా దానికి దగ్గర పోలికగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రతి ఫ్రేమ్ ని డిజైన్ చేశాడు దర్శకుడు అనీష్ కృష్ణ. కొత్త దర్శకుడు అని ఎక్కడా అనిపించకుండా టైటిల్స్ మొదలైనప్పటి నుంచి ఎండి కార్డు పడే వరకు సినిమా మీద ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశాడు. అందులో దాదాపు చాలా వరకు సఫలం అయ్యాడు. కథ కొత్తగా అనిపించకపోయినా కామెడీతో కొంతమేర ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సఫలం అయ్యారని చెప్పాలి. అయితే సినిమాకు ప్రధానంగా మైనస్ అనిపించే విషయం ఏమిటంటే ముందు జరగబోయే సీన్లు ప్రేక్షకులు ముందే ఊహించేస్తారు. గతంలో ఎన్నో సినిమాలు చూసిన అనుభవం వల్లనో మరేమిటో చెప్పలేము కానీ జరగబోతున్న విషయాన్ని ప్రేక్షకులు ముందే ఊహిస్తారు. ఇక అలా ఎలాంటి సస్పెన్స్ లేకుండా చూపించి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఓవరాల్ గా చూస్తే కథాకథనం అన్ని రొటీన్ గానే ఉన్నా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు పాస్ అయ్యాడనే చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే:
నటీనటుల విషయానికి వస్తే నాగశౌర్య ఎప్పటిలాగానే చాలా కూల్ గా తనదైన శైలిలో నటించారు. ఎక్కడా ఓవర్ పెర్ఫార్మన్స్ చేయకుండా సెట్టిల్డ్ గా తన రోల్ లో కరెక్ట్ గా సెట్ అయ్యాడు. కొత్త భామ షెర్లీ కొన్ని కొన్ని సీన్లలో నటన విషయంలో తడబడింది. అయితే అందాల ఆరబోత విషయంలో మాత్రం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఇక నాగశౌర్య తల్లి పాత్రలో రాధిక శరత్ కుమార్ జీవించేసింది. ఒక నిజమైన సంప్రదాయ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ స్త్రీ ఇలానే ఉంటుందా అనిపించే విధంగా ఆమె నటన సినిమా మొత్తాన్ని నడిపించింది. జయ ప్రకాష్, బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్, హిమజ, అన్నపూర్ణమ్మ వంటి వారు తమ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే
సాంగ్స్ విషయంలో థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ ఎదురవుతుంది. సాంగ్స్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం సినిమాకి తగినట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు కాస్త రీచ్ లుక్ తీసుకొచ్చింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి, సొంత ప్రొడక్షన్ కావడంతో నాగశౌర్య ఎక్కడా వెనక్కి తగ్గకుండా డబ్బులు పెట్టినట్టు అనిపిస్తుంది. రెండో భాగం స్క్రీన్ ప్లే విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది.

ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే: 
ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. చిన్నచిన్న లోపాలు ఉన్న పెద్దగా పట్టించుకోకుండా ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి.

Rating: 2,75/5

Also Read: Raviteja Dhamaka Release: భలే స్కెచ్చేసిన మాస్ మహా రాజా.. తమిళ హీరోలకు పోటీగా రంగంలోకి!

Also Read: Kriti Kharbanda Hot Photos: థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న కృతి కర్బందా.. ఫోటోలు చూశారా?

Trending News