Krishna Vamsi: పెద్ద రిస్క్ తీసుకోబోతున్న కృష్ణవంశీ.. తన తదుపరి సినిమాలో అదే ట్విస్ట్

Krishna Vamsi Upcoming Movies: లవ్ స్టోరీల దగ్గర నుంచి దేశభక్తి చిత్రాల వరకు కృష్ణవంశీ మూవీ తీయని జోనర్ లేదు. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ కు ఇప్పుడు బ్యాడ్ ఫామ్ నడుస్తోంది. మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావడానికి ఈ సీనియర్ డైరెక్టర్ ఇప్పుడు చాలా పెద్ద రిస్క్ తీసుకోబోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2024, 11:34 AM IST
Krishna Vamsi: పెద్ద రిస్క్ తీసుకోబోతున్న కృష్ణవంశీ.. తన తదుపరి సినిమాలో అదే ట్విస్ట్

Krishna Vamsi Next: నిన్నే పెళ్ళాడుతా, గులాబి.. ఇప్పటికి కూడా యూత్ లో ఈ చిత్రాలకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా ఉండే సినిమాలలో ఇవి కూడా ఉన్నాయి. అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలతో పాటు ఖడ్గం లాంటి దేశభక్తి చిత్రాలను కూడా బ్యాలన్స్ చేయగలిగే డైరెక్టర్ కృష్ణవంశీ. సింధూరం లాంటి కాంట్రవర్సీ మూవీ ని కూడా అద్భుతంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ.

ఇలా చెప్పుకుంటూ పోతే అతని కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇంత సీనియర్ డైరెక్టర్ కి బ్యాడ్ ఫామ్ నడుస్తోంది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో తీసిన గోవిందుడు అందరివాడే చిత్రం కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా కృష్ణ వంశీ గత సంవత్సరం ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ లాంటి సీనియర్ యాక్టర్స్ తో రంగమార్తాండ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ అందరి దగ్గర ప్రశంసలు అందుకుంది కానీ నిర్మాతలకు కలెక్షన్స్ తెచ్చి పెట్టలేకపోయింది. 

ఓ రేంజ్ కి వచ్చాక సీనియర్ డైరెక్టర్లు సాధారణంగా రిస్క్ చేయరు. అయితే కృష్ణవంశీ మాత్రం దీనికి భిన్నంగా కొత్తదనాన్ని వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మూడు జంటలతో ముడిపడిన ఓ ప్రేమ కథను ప్లాన్ చేస్తున్నారంట ఈ డైరెక్టర్.‌అయితే ఈ మూవీలో స్టార్ హీరో, హీరోయిన్స్ లను కాకుండా.. డెబ్యూ యాక్టర్స్ ని తీసుకొని తక్కువ బడ్జెట్ తో ఓ మంచి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని చేయాలని కృష్ణవంశీ భావిస్తున్నారట. అయితే ఇలా కొత్తవారితో ప్రస్తుతం కృష్ణవంశీ తీయడం అనేది సాహసమే అని చెప్పాలి.

సుమారు 30 సంవత్సరాల క్రితం గులాబీ మూవీతో యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృష్ణవంశీ.. ప్రజెంట్ జనరేషన్ పల్స్ పట్టుకోగలుగుతారా అనేది బేతాళ ప్రశ్నగా మారింది. యూత్ ఆలోచన తీరులో అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మరి ఆ స్పీడ్ అందుకోవడంలో కృష్ణవంశీ ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న విషయం తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, వివి వినాయక్ లాంటి ఎందరో సీనియర్లు ఈ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ అర్థం కాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కృష్ణవంశీ చేస్తున్న ఎక్స్పరిమెంట్ చాలా రిస్కీ అన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

Also Read: Telangana: ఆనాడే అత్యంత ధనిక సీఎం కేసీఆర్‌.. ఆయనకు హెలికాప్టర్‌ ఎక్కడిది?

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News