NTR 30 Title : పవన్ కళ్యాణ్ కోసం దాచిన టైటిల్ ఎన్టీఆర్‌కా?.. పెదవి విరుస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్

NTR 30 Title Devara Rumors ఎన్టీఆర్ ముప్పై అంటూ రాబోతోన్న ప్రాజెక్ట్ టైటిల్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి దేవర అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 11:54 AM IST
  • NTR 30 టైటిల్ అప్డేట్
  • బండ్ల గణేష్ దాచిన టైటిల్‌పై కన్ను
  • దేవర అంటూ రాబోతోన్న ఎన్టీఆర్
NTR 30 Title : పవన్ కళ్యాణ్ కోసం దాచిన టైటిల్ ఎన్టీఆర్‌కా?.. పెదవి విరుస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్

NTR 30 Movie Title Buzz : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోతోన్న సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తీసినా కూడా కొరటాల మీదున్న నమ్మకంతో ఎన్టీఆర్ చాన్స్ ఇచ్చాడు. సినిమా తీసేందుకు ముందుకు వచ్చాడు. అయితే ఆచార్య అపవాదును తీసి పడేసుకునేందుకు కొరటాల కూడా భారీగానే కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కోసం రాసిన కథను ఇంకా చెక్కుతూనే ఉన్నారట. ఇంత వరకు బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీ అవ్వలేదని సమాచారం.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూవీ కోసం దేవర అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ టైటిల్‌ను మామూలుగా అయితే బండ్ల గణేష్ రిజిష్టర్ చేయించుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం ఈ టైటిల్‌ను బండ్ల గణేష్ రిజిష్టర్ చేయించుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం దాన్ని రెన్యూవల్ చేయించుకోలేదట. దీంతో ఆ టైటిల్‌ను ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం వాడుకుందామని అనుకుంటున్నారట.

దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఈ టైటిల్ ఏమీ బాగా లేదని, తెలుగు వరకు ఈ టైటిల్ ఓకే అనుకుంటే.. పాన్ ఇండియన్ లెవెల్లో ఏ టైటిల్ పెడతారు? అంటూ టీంను నిలదీస్తున్నారు. ఈ టైటిల్ తమకేమీ నచ్చలేదని నందమూరి అభిమానులు అంటున్నారు.మరి వీటిపై ఎన్టీఆర్ ఆర్ట్స్ ఏమైనా స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

అసలు టీం మైండ్‌లో ఈ టైటిల్ ఉందో లేదో?.. ఈ గాసిప్ కేవలం గాలి వార్తే కూడా కావొచ్చు. కానీ ఒక్కసారిగా దేవర టైటిల్ మీద అయితే చర్చ మొదలైంది. ఇదే టైటిల్ ఎన్టీఆర్‌కి పెడితే.. అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఈ NTR 30 సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు అప్డేట్ ఇస్తారన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

Also Read : Yashoda Box Office Collection Day 1 : యశోద ఫస్ట్ డే కలెక్షన్లు.. సమంతకు పెద్ద అమౌంటే కానీ

Also Read : Jr NTR New Look : ఎన్టీఆర్ న్యూ లుక్.. బండ్లన్న ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News