KJ Sarathi Dead: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత!

Telugu comedian KJ Sarathi passed away. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయ సారథి (83) కన్నుమూశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 1, 2022, 02:52 PM IST
  • టాలీవుడ్‌లో విషాదం
  • ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
  • సినీ నటీనటుల సంతాపం
KJ Sarathi Dead: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత!

Tollywood comedian Kadali Jaya Sarathi dies at 83: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయ సారథి (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సారథి.. హైదరాబాద్ నగరంలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కేజే సారథి మరణ వార్తలో టాలీవుడ్‌లో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు తెలుగు సినీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జయ సారథి అంత్యక్రియలు జరగనున్నాయి. జ‌య‌సార‌థి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని భీమ‌వ‌రంలో 1942 జూన్ 26న జ‌న్మించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌ రావు హీరోగా న‌టించిన 'వెలుగు నీడ‌లు' సినిమాతో సారథి సినీ ఎంట్రీ ఇచ్చారు. మ‌నఊరి రామాయ‌ణం, పరమానందయ్య శిష్యుల కథ, బొబ్బిలి బ్ర‌హ్మ‌ణ‌, డ్రైవ‌ర్ రాముడు, సీతారామ కళ్యాణం, భ‌క్త క‌న్న‌ప్ప లాంటి హిట్ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా ఆయన  'హ‌లో అల్లుడు' సినిమాలో న‌టించారు. దాదాపుగా 372 చిత్రాల్లో నటించిన సారథి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు.

జయ సారథి కేవలం హాస్య నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు సినిమాలను ఆయన నిర్మించారు. కొన్ని చిత్రాలకు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చూశారు. రెబల్ స్టార్ కృష్ణం రాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలకు ఆయన సాంకేతికంగా చూసుకునేవారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తరలించడంలో అయన క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు కూడా. 

Also Read: LPG Price Today: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర!  

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News