Kiran Abbavaram Becomes Father: టాలీవుడ్లో ఎంతోమంది సెలబ్రెటీలు ప్రేమించుకొని వివాహం చేసుకున్నవారు ఉన్నారు. అలాంటి వారిలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ కూడా ఒకరు. సుమారుగా ఐదేళ్లపాటు ప్రేమించుకొని, ఆగస్టు 22న 2024లో వివాహం చేసుకోవడం జరిగింది. వీరి పెళ్లి చాలా గ్రాండ్గా పెద్దల సమక్షంలో జరిగింది. మొదటిసారి రాజా వారు రాణి గారు సినిమాలో నటించిన ఈ జంట ఆ తర్వాత వీరి మధ్య స్నేహం ప్రేమగా మారిందట. ఇటీవల కిరణ్ అబ్బవరం' క' సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది.
ఇప్పుడు తాజాగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తూ కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని పంచుకోవడం జరిగింది. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కిరణ్ అబ్బవరం తన భార్య అయినటువంటి రహస్య గొరక్ తో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ.. తన భార్య పొట్టపై చేతులు జోడించి మరీ ఈ గుడ్ న్యూస్ ని తెలియజేశారు.
Our love is growing by 2 feet 👣👼🐣 pic.twitter.com/69gL0sALaZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025
అలాగే మా ప్రేమ రెండు అడుగులు పెరుగుతోంది అంటూ ఒక కొటేషన్ ని కూడా షేర్ చేశారు.. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి పెళ్లయిన ఏడాదిలోపే గుడ్ న్యూస్ చెప్పారు కిరణ్ అబ్బవరం.
కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. తాజాగా కిరణబ్బవరం నటిస్తున్న దిల్ రూబా సినిమా.. ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కూడా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు ఈసారి అభిమానులను కిరణ్ అబ్బవరం మెప్పించగలుగుతారో చూడాలి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.