Kinnerasani Trailer: 'కారణం లేని ప్రేమ.. గమ్యం లేని ప్రయాణం' చాలా గొప్పవంట..కల్యాణ్‌ దేవ్‌ సినిమా ట్రైలర్l

Kinnerasani Trailer: మెగాస్టార్ చిరంజీవి అల్లుడు హీరో కల్యాణ్‌ దేవ్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'కిన్నెరసాని'. రమణతేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదలైంది. జనవరి 26న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 12:59 PM IST
Kinnerasani Trailer: 'కారణం లేని ప్రేమ.. గమ్యం లేని ప్రయాణం' చాలా గొప్పవంట..కల్యాణ్‌ దేవ్‌ సినిమా ట్రైలర్l

Kinnerasani Trailer: 'విజేత' సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా వస్తున్న చిత్రం 'కిన్నెరసాని'. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. తాజాగా కళ్యాణ్ దేవ్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కిన్నెర సాని ట్రైలర్  ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.

ట్రైలర్ వీడియో చూస్తుంటే మర్డర్ మిస్టరీ లాగా ఉందని తెలుస్తోంది. డైలాగులు ప్రధానంగా నిలిచాయి. నటీనటుల హావభావాలు, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచింది. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తుంటే క్రైమ్‌, సస్పెన్స్‌ అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది. 

ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి, సాయి రిషిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడైన కల్యాణ్‌దేవ్‌.. 'విజేత' చిత్రంతో నటుడిగా మారిన సంగతి తెలిసిందే. చివర్లో కల్యాణ్ దేవ్ లుక్ భయం కలిగించేలా ఉంది. మొత్తానికి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్ తో కల్యాణ్ దేవ్ కొత్తగా కనిపిస్తున్నాడు. 'అశ్వద్ధామ' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ 'కిన్నెరసాని' చిత్రానికి దర్శక్మత్వంవహిస్తున్నాడు.   

Also Read: Dakko Dakko Meka Video Song: 'పుష్ప' నుంచి బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'దాక్కో దాక్కో మేక' వీడియో సాంగ్ వచ్చేసింది!

Also Read: NTR Comments on Ram Charan: రామ్ చరణ్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 'మా బంధం ఈ సినిమాతో ముగిసిపోదు!'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News