KGF Chapter 2 OTT: ఓటీటీలో కేజీయఫ్‌ చాప్టర్‌ 2.. సినిమాను వీక్షించాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!

KGF Chapter 2 Movie is now available to rent on Amazon Prime. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో 'కేజీయఫ్‌ చాప్టర్‌ 2' సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. సినిమాను ఇప్పటికిప్పుడే వీక్షించాలంటే మాత్రం రూ.199 చెల్లించాల్సి ఉంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 12:42 PM IST
  • ఓటీటీలో కేజీయఫ్‌ చాప్టర్‌ 2
  • సినిమాను వీక్షించాలంటే డబ్బులు చెల్లించాల్సిందే
  • కొన్ని రోజులు ఆగితే ఉచితంగా
KGF Chapter 2 OTT: ఓటీటీలో కేజీయఫ్‌ చాప్టర్‌ 2.. సినిమాను వీక్షించాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!

KGF Chapter 2 Movie is now available to rent on Amazon Prime Video: ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్ష‌న్‌లో కన్న‌డ స్టార్ హీరో య‌శ్‌ న‌టించిన పాన్ ఇండియా సినిమా 'కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2'. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. వసూళ్ల పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 ఇప్పటివరకు రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైం వీడియో.

ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో 'కేజీయఫ్‌ చాప్టర్‌ 2' సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కేజీయఫ్‌ 2 స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమాను ఇప్పటికిప్పుడే వీక్షించాలంటే మాత్రం రూ.199 చెల్లించాల్సి ఉంది. అమెజాన్ స‌బ్ స్క్రైబ‌ర్ల కంటే ముందే సినిమా చూడాలంటే.. ఎర్లీ యాక్సెస్‌ పేరిట రూ.199 చెల్లించాలంటూ అమెజాన్‌ కొత్త ఆఫ‌ర్‌ను  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. మొత్తానికి కేజీయఫ్‌ 2 చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. 

'కేజీయఫ్‌ చాప్టర్‌ 2' సినిమాను ఓసారి అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఒకసారి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లోనే చూడాలి. మొత్తానికి ఓటీటీలో ముందుగా సినిమా చూడాలంటే.. థియేట‌ర్‌కు వెళ్లినంత    ఖ‌ర్చ‌వుతున్న‌ట్టే. అన్ని రూపాయలు పెట్టినా.. థియేట‌ర్‌లో సినిమా చూసిన థ్రిల్‌ ఓటీటీలో రాదు. మరి అమెజాన్‌ పెట్టిన ఈ కొత్త విధాన ఆఫర్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. మరోవైపు కొన్ని రోజులు ఆగితే అమెజాన్‌ స‌బ్ స్క్రిప్ష‌న్ ఉన్న వారు ఉచితంగానే సినిమా చూసుకునే అవకాశం ఉంది. 

ఇక మే 20న రాబోతున్న మరో పాన్ ఇండియా సినిమా 'ఆర్‌ఆర్ఆర్'కు కూడా ఓటీటీలో డబ్బులు చెల్లించాలని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. T-VOD ప్రాతిపదికన అందుబాటులో తీసుకొస్తున్నట్లు జీ5 చెబుతోంది. ఆర్‌ఆర్ఆర్‌ సినిమా ఓటీటీలో చూడాలంటే రూ.100 కట్టాలట. దీని వ్యాలిడిటీ 7 రోజులు. సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 24 గంటల్లోనే చూసేయాలి. ఈ కొత్త విధానం ఏ మేరకు వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: LIC IPO Listing: నిరాశపర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌.. అసంతృప్తిలో ఇన్వెస్ట‌ర్లు!

Also Read: SSY Scheme: నెలకు రూ.250 డిపాజిట్ చేస్తే చాలు.. ఈ ప్రభుత్వ పథకంతో కూతురి పెళ్లి సజావుగా జరిగిపోతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News