KGF 2 Trailer: సినీ అభిమానులకు హెచ్చరిక.. కేజీఎఫ్ ట్రైలర్ తుపాను రాబోతోంది!

KGF 2 Trailer Release Date: సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్ 2' మూవీ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 14న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో గురువారం సినిమా ట్రైలర్ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 12:13 PM IST
    • కేజీఎఫ్ మూవీ అభిమానులకు గుడ్ న్యూస్
    • సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్న చిత్రబృందం
    • మార్చి 27 సాయంత్రం 6.40 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన
KGF 2 Trailer: సినీ అభిమానులకు హెచ్చరిక.. కేజీఎఫ్ ట్రైలర్ తుపాను రాబోతోంది!

KGF 2 Trailer Release Date: కన్నడ స్టార్ హీరో యష్ ప్రధానపాత్రలో నటించిన 'కేజీఎఫ్ 1' దాదాపు మూడేళ్ల క్రితం థియేటర్లలో విడుదలైంది. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2018 డిసెంబరు 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. 

'కేజీఎఫ్ చాప్టర్ 1' సినిమాకు వచ్చిన విశేషాదరణ నేపథ్యంలో ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ స్వీక్వెల్ కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'కేజీఎఫ్ 2'ను ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ అప్డేట్ ను చిత్రబృందం ప్రకటన చేసింది. మార్చి 27న సాయంత్రం 6.40 గంటలకు 'కేజీఎఫ్ పార్ట్ 2' మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ విలన్ పాత్ర పోషించారు. 'అధీరా' పాత్రలో సంజయ్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రంలో హీరో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, టాలీవుడ్‌ నటుడు రావు రమేష్‌ కీలకపాత్రలు పోషించారు.

Also Read: Bigg Boss Non Stop Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులకు షాక్.. బిగ్ బాస్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ నిలిపేసిన డిస్నీ హాట్ స్టార్!

Also Read: Meenakshi Chaudhary Photos: షార్ట్ డ్రస్సులో అలరిస్తున్న టెంప్టింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News