Kethika Sharma: కేతిక శ‌ర్మ‌కు బంపర్ ఆఫర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా!

Kethika Sharma to act in Pawan Kalyan Movie Vinodhaya Sitham Remake. వినోద‌య సిత్తం రీమేక్‌లో హీరోయిన్‌గా కేతిక శ‌ర్మ‌ను ఫైన‌ల్ చేశార‌ని స‌మాచారం. సాయి ధ‌ర‌మ్ తేజ్ సరసన కేతిక నటించనుందట.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 03:34 PM IST
  • కేతిక శ‌ర్మ‌కు బంపర్ ఆఫర్
  • ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా
  • కృతి శెట్టి, శ్రీలీల పేర్లు
Kethika Sharma: కేతిక శ‌ర్మ‌కు బంపర్ ఆఫర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా!

Kethika Sharma to act in Pawan Kalyan's Vinodhaya Sitham Remake: ఇటీవల విడుద‌లైన 'భీమ్లా నాయక్' చిత్రంతో హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వ‌రుస పెట్టి సినిమాల‌ను చేస్తున్నాడు. ప్ర‌స్తుతం 'హ‌రి హ‌ర వీర మ‌ల్లు' సినిమాపై ఫోక‌స్ పెట్టారు. పీరియాడిక్ మూవీగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ చూస్తున్నాడు. దీంతో పాటు మ‌రో రీమేక్ సినిమాలో న‌టించ‌డానికి పవర్ స్టార్ ఓకే చెప్పాడు. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన 'వినోద‌య సిత్తం' రీమేక్‌లో పవన్ నటించనున్నాడు. 

వినోద‌య సిత్తం ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన స‌ముద్ర‌ఖని రీమేక్‌ను కూడా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా హీరో, పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రో ప్రధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కేతిక శ‌ర్మ‌ను ఫైన‌ల్ చేశార‌ని స‌మాచారం. సాయి ధ‌ర‌మ్ తేజ్ సరసన కేతిక నటించనుందట. త్వ‌ర‌లోనే దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది. కేతిక కంటే ముందు కృతి శెట్టి, శ్రీలీల పేర్లు వినిపించాయి. 

వినోద‌య సిత్తం రీమేక్‌ షూటింగ్ జూలైలో ఆరంభం కానుందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీపై టీ.జీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్లు ఇచ్చాడ‌ని టాక్. పవన్ ఈ 20 రోజుల‌కుగానూ ఏకంగా 50 కోట్ల రూపాయ‌ల‌ను రెమ్యున‌రేష‌న్‌గా తీసుకోబోతున్నార‌ట‌. స‌ముద్ర ఖ‌ని, త్రివిక్ర‌మ్ వినోద‌య సిత్తం సినిమాను తెలుగు నెటివిటీకి తగిట్లు మార్పులు చేర్పులు చేయ‌డంలో బిజీబిజీగా ఉన్నార‌ట‌. త్వ‌ర‌గానే సినిమాను స్టార్ట్ చేసి పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చూస్తున్నారట.

Also Read: IND vs SA 2nd T20: ఆ ఒక్కడు తప్పితే.. టీమిండియాలో మరో వికెట్‌ టేకింగ్‌ బౌలర్ లేడు: గవాస్కర్

Aslo Read: Rishabh Pant: అందుకే ఓడిపోయాం.. ఇక మూడు మ్యాచ్‌లు గెలవాల్సిందే: పంత్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News