Keerthy Suresh marriage: కీర్తి సురేష్‌ పెళ్లికి ఒత్తిడి

Actress Keerthy Suresh wedding rumours | కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందా అనే రూమర్స్ మరోసారి తెరపైకొచ్చాయి. గతంలో ఇదే ఏడాది ఏప్రిల్‌లో కీర్తి సురేష్ వెడ్డింగ్ రూమర్స్‌తో వార్తల్లోకెక్కిన విషయం గుర్తుండే ఉంటుంది.

Last Updated : Dec 30, 2020, 07:09 AM IST
Keerthy Suresh marriage: కీర్తి సురేష్‌ పెళ్లికి ఒత్తిడి

Actress Keerthy Suresh wedding rumours | కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందా అనే రూమర్స్ మరోసారి తెరపైకొచ్చాయి. గతంలో ఇదే ఏడాది ఏప్రిల్‌లో కీర్తి సురేష్ వెడ్డింగ్ రూమర్స్‌తో వార్తల్లోకెక్కిన విషయం గుర్తుండే ఉంటుంది. కీర్తి సురేష్‌కి పెళ్లి అయిపోయిందంటూ అప్పట్లో ఏకంగా కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కీర్తి సురేష్ నటి మేనక, కేరళకు చెందిన వ్యాపారవేత్త సురేష్ కుమార్ దంపతుల కుమార్తె. కీర్తి కోలీవుడ్‌లో ‘ఇడు ఎన్నా మాయం’ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాతో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకున్న కీర్తి సురేష్... ఒక ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోనున్నట్టు గతంలో సినీ పరిశ్రమలో ప్రచారం జరిగింది. తనని వివాహం చేసుకోమని కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని, అయితే కీర్తి సురేష్‌కి మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు అంత ఇష్టంగా లేదని.. తన నటనా వృత్తిని మరికొన్ని సంవత్సరాలు పాటు కొనసాగించాలనే ఆలోచిస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

కీర్తి సురేష్‌పై ( Keerthy Suresh ) పెళ్లి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం తన పెళ్లి ప్లాన్స్ ( Keerthy Suresh wedding plans ) అన్నింటినీ లైట్ తీసుకుని ప్రస్తుతానికి స్క్రిప్ట్స్ వినడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. గీతా గోవిందం ఫేమ్ పరశురాం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 2021 జనవరిలో సర్కారు వారి పాట మూవీకి ( Sarkaru vaari paata movie ) సంబంధించిన తదుపరి షెడ్యూల్ సెట్స్‌పైకి వెళ్లనుంది.

Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్ మళ్లీ వాయిదా పడిందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News