మహానటి కీర్తి సురేష్ గురించి సౌత్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళం, మలయాళంలో మంచి క్రేజ్ దక్కించుకున్న కీర్తి సురేష్.. మెల్లిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ చిత్రం కీర్తి సురేష్‌కు మంచి డెబ్యూగా నిలిచింది. తెలుగులో మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించింది.
నేను శైలజ సినిమా హిట్ అయిన తరువాత కీర్తి సురేష్‌కు తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ కోలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేసింది. నాని నేను లోకల్ సినిమాతో మళ్లీ కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్‌తో చేసిన అజ్ఞాతవాసి సినిమా కీర్తి సురేష్‌కు బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
కీర్తి సురేష్ తమిళంలో ధనుష్‌తో నటించిన రైల్ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కంట్లో పడింది. ఆ సినిమాను చూసిన తరువాతే.. మహానటి సినిమాకు చాన్స్ ఇచ్చాడు. మహానటి సినిమాలో సావిత్రిలా కీర్తి సురేష్ నటించి.. అందరినీ ఆకట్టుకుంది. జాతీయ స్థాయిలో మహానటిగా కీర్తి సురేష్ ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా అవార్డు అందుకుని తన సత్తాను చాటుకుంది.
కీర్తి సురేష్ మహానటి తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. మహానటి తరువాత తమిళంలో స్టార్ హీరోలందరితోనూ నటించింది. విక్రమ్, విశాల్, విజయ్ ఇలా అందరితో వరుసగా సినిమాలు చేసింది. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా సరైన హిట్‌గా నిలవలేదు. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లను మాత్రమే చేసింది.
కరోనా సమయంలో కీర్తి సురేష్ నటించిన సినిమాలన్నీ ఓటీటీలో వచ్చాయి. పెంగ్విన్, మిస్ ఇండియా వంటి సినిమాలు ఓటీటీలో వచ్చి ఫ్లాపులుగా నిలిచాయి. గుడ్ లక్ సఖి సినిమా థియేటర్లో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అలా కీర్తి సురేష్ ఖాతాలో అన్నీ డిజాస్టర్లే వచ్చి పడ్డాయి.
కీర్తి సురేష్‌కు చివరగా మహేష్ బాబు సర్కారు వారి పాట కాస్త ఉపశమనం ఇచ్చింది. కమర్షియల్ విజయం సాధించి మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. కాస్త బోల్డ్‌గా కనిపించే పాత్రలో కీర్తి సురేష్ నటించి మెప్పించింది. అయితే చిన్ని అనే సినిమాతో మరోసారి తన నటనలోని సత్తాను చాటింది.