Sardar Movie Twitter Review : సర్దార్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టేసిన కార్తీ

Karthi Prince Sardar Twitter Review కొత్త జానర్లతో వరుసగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు హీరో కార్తీ. ఇప్పుడు సర్దార్ అనే చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 08:06 AM IST
  • నేడు విడుదల కానున్న సర్దార్
  • హిట్ కొట్టేసిన కార్తీ?
  • ట్విట్టర్‌లో సర్దార్‌పై ప్రశంసలు
Sardar Movie Twitter Review : సర్దార్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టేసిన కార్తీ

Sardar Movie Twitter Review : కార్తీ ఎంచుకునే ప్రాజెక్టులు, చేసే సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కార్తీకి తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో ఒకే రకమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. తెలుగు హీరోగానే కార్తీని పరిగణిస్తుంటారు. అయితే కార్తీ ఈ మధ్య ఎంచుకుంటున్న ప్రాజెక్ట్‌లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖాకీ, ఖైదీ సినిమాలతో కోలీవుడ్, టాలీవుడ్‌ను షాకింగ్‌కు గురి చేశాడు. అయితే ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ పీఎస్ మిత్రన్‌తో జత కట్టేశాడు కార్తీ.

 

పీఎస్ మిత్రన్ ఇది వరకు తీసిన ఇరుంబుదిరై తెలుగులో విశాల్ అభిమన్యుడు సినిమాతో హిట్ కొట్టేశాడు. అలా ఇప్పుడు మళ్లీ కార్తీతో సర్దార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో కార్తీకి హిట్ పడ్డట్టే అని జనాలు అనుకుంటున్నారు. పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

సర్దార్ సినిమాలో కార్తీ మాస్ ఎంట్రెన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రిన్స్ సినిమాకే బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయ్ అని.. త్వరలోనే సర్దార్ వాటిని బీట్ చేస్తుందని అంటున్నారు. మొత్తానికి సర్దార్ సినిమా మాత్రం కాస్త గ్రిప్పింగ్‌గా ఉందని, అదే హిట్ అవుతుందని జనాలు అంటున్నారు.

 

సర్దార్ సినిమా హిట్ అవ్వడంతో.. జనాలు సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు. దీపావళికి కార్తీ అన్నా వస్తే అది హిట్టే అని అంటున్నారు. ఖైదీ వర్సెస్ బిగిల్ నడిచింది.. ఇప్పుడు ప్రిన్స్ వర్సెస్ సర్దార్ నడుస్తోంది.. అప్పుడు ఇప్పుడూ కార్తీనే గెలిచాడు అంటూ ఇలా జనాలు నాటి సినిమాను గుర్తుచేసుకుంటున్నారు.

 

మొత్తానికి కార్తీ మాత్రం ఈ సారి హిట్ కొట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక ఇందులో రజిషా విజయన్ యాక్టింగ్, రాశీ ఖన్నా, లైలా వంటి వారి పాత్రలు హైలెట్ అవుతున్నాయట. పీఎస్ మిత్రన్ మరోసారి తన మ్యాజిక్ చూపించినట్టు తెలుస్తోంది. ఓల్డ్, యంగ్ పాత్రల్లో కార్తీ అదరగొట్టేశాడని అంటున్నారు.

Also Read :  Prince Movie Twitter Review : ప్రిన్స్ ట్విట్టర్ రివ్యూ.. యావరేజ్ అంటోన్న నెటిజన్లు

Also Read : Ginna Movie Twitter Review : జిన్నాకు మొదటి రోజే ఎదురుదెబ్బ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News