Kannada Hero Puneeth Rajkumar Death LIVE Updates Puneeth Rajkumar's Funeral Moved To Sunday: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూయడంతో సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. పునీత్ (Puneeth Rajkumar) పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచారు. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు తండ్రి సమాధి దగ్గరే నిర్వహించనున్నారు.
కన్నడ కంఠీరవ స్టేడియంలో (kanteerava stadium) ఉన్న పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా అక్కడకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. పునీత్‌కు తుది నివాళులర్పించేందుకు అభిమాన జనం వేలాదిగా తరలివచ్చారు. చిరంజీవి, (Chiranjeevi) ఎన్టీఆర్, (NTR) బాలకృష్ణ, (Balakrishna) రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read : Puneeth Rajkumar's death: పునీత్ రాజ్‌కుమార్ మృతికి అసలు కారణం ఇదేనా ?
కాగా, పునీత్ అంత్యక్రియలను శనివారం నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు రాక ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో పునీత్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేసినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (karnataka chief minister basavaraj bommai) ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. పునీత్ పెద్ద కూతురు ధ్రుతి ఇప్పటికే అమెరికా నుంచి బయల్దేరింది. ఆదివారం పునీత్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
గతంలో రాజ్ కుమార్ మృతదేహానికి జరిగిన రీతిలోనే ఆయన కుమారుడు పునీత్ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు మొత్తం 14 కిలోమీటర్ల (14 kilometers) పాటు పునీత్ అంతిమయాత్ర సాగనుంది. ఇక రాజ్‌కుమార్ (Rajkumar) కుటుంబానికి సంబంధించి గతంలో అంతిమయాత్రల్లో రక్తపాతం చోటుచేసుకోవడంతో పునీత్ మరణం తర్వాత శాంతిభద్రతల కోణంలో కర్ణాటక (Karnataka) ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అలాగే పునీత్ (Puneeth Rajkumar) మరణవార్తను తట్టుకోలేక పలువురు అభిమానులు చనిపోయారు. కొందరు గుండెపోటుకు గురి కాగా, ఇంకొందరు బలవన్మరణాకలు పాల్పడ్డారు.
Also Read : Balakrishna pays Final Respects to Puneeth: పునీత్‌ను కడసారి చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook