Satyajith Passed Away: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

సినిమా ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ ఆదివారం రోజున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2021, 12:52 PM IST
  • సినీ పరిశ్రమకు మరో విషాదం
  • అనారోగ్యంతో కన్నడ నటుడు సత్యజిత్ మృతి
  • సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్న స్టార్స్
Satyajith Passed Away: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

Satyajith Passed Away: సినిమా ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. కొంత మంది కరోనా కారణంగా మృత్యువాత పడగా మరికొంత మంది అనారోగ్యాలతో మరణిస్తున్నారు, మరి కొంత మంది నటులు వ్యక్తిగత కారణాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు . టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ వంటి అన్ని రకాల సినిమా పరిశ్రమలలో వరుస మరణాల కారణంగా ఇండస్ట్రీ దుఖః సాగరంలో మునిగిపోతుంది. 

వరుస మరణ వార్తలతో ఇండస్ట్రీ వర్గాలు తెలుకోక ముందే మరో నటుడి మరణంతో ఇండస్ట్రీ షాక్ కు గురైంది. ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ (Kannada Actor satyajith) (72) ఆదివారం తెల్లవారు జామున బెంగుళూరు  (Bangalore) లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికితా పొందుతూ మరణించారు. 

Also read: MAA Elections 2021: మెగాబ్రదర్ సంచలన నిర్ణయం..'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

నటుడు సత్యజిత్ అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్ సత్యజిత్, 1986లో అరుణరాగ (Anuragha Movie) అనే సినిమా ద్వారా సినీ ఆరంగేట్రం చేసిన ఆయన.. తెలుగు (Telugu), తమిళ (Tamil), కన్నడ (Kannada) సహా పలు భాషల్లో దాదాపు 650కుపైగా సినిమాల్లో నటించిన సత్యజిత్​...  స్టార్​ హీరోస్ నటులు రాజ్​ కుమార్ (Hero Raj Kumar), విష్ణువర్ధన్ (Vishnu Varshan), పునీత్​ రాజ్ (Puneeth Raj), సుదీప్​లతో (Hero Sudheep) కలిసి నటించారు.  పదవ తరగతి వరకు చదువుకున్న సత్యజిత్ సినిమా పై ఉన్న ఆసక్తి కారణంగా ఇండస్ట్రీ వైపుగా అడగకు వేశారు. 

సినిమాలలో విలన్ గా నటించే సత్యజిత్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ ప్రేక్షకులకు ఎంత గానో సుపరిచితులైన ఆయన.. తెలుగులో డబ్ అయిన కొన్ని కన్నడ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. ఆయన మరణ వార్త విన్న సినీ వర్గాలు విచారానికి గురై.. సోషల్ మీడియాలో ఆయన ఆత్మ కు శాంతి చేకూర్చాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Also read: Jawad Cyclone Ahead: బంగాళాఖాతంలో మరో తుపాను, ఏపీ-ఒడిశాలకు పొంచి ఉన్న ముప్పు

కొన్ని రోజుల కింద సత్యజిత్ కాలికి గాయం అవ్వటంతో.. గ్యాంగ్రిన్‏తో చికిత్స పొందుతుండగా..ఉన్నట్టుండి గుండెపోటు రావటంతో బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందున్న సమయంలో ఆయన కన్నుమూసి నట్లుగా తెలుస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News