Kamal Haasan discharge: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కమల్...ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

Kamal Haasan discharge: విలక్షణ నటుడు కమల్​హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 12:47 PM IST
  • కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కమల్
  • చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
  • గత నెల 22న ఆసుపత్రిలో చేరిక
Kamal Haasan discharge: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కమల్...ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

Kamal Haasan discharge: తమిళ అగ్రకథానాయకుడు కమల్​హాసన్(Kamal Haasan) ఇటీవల కరోనా(Corona Virus) నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. రెండు వారాలుగా ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పతి(Sri Ramachandra Hospital)లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయన ఐసోలేషన్  నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రి సిబ్బందితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

నవంబరు 22న కమల్ కరోనా బారిన పడ్డారు. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న తర్వాత​ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌(Covid-19 positive)గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​లో వెల్లడించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే డిసెంబరు 1న కరోనా నుంచి ఆయన కోలుకున్నట్లు శ్రీరామచంద్ర ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కానీ డిసెంబరు 3 వరకు ఆయన ఐసోలేషన్​లోనే ఉంటారని ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. 

Also Read: Brahma Mishra Mirzapur: అనుమానస్పద స్థితిలో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ నటుడు మృతి

ఈ సందర్బంగా తను కోలుకోవాలని కోరుకున్న వైద్యులకు, మిత్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ కమల్ ట్వీట్ చేశారు. త్వరలోనే కమల్​.. 'విక్రమ్'​ సినిమా(Vikram Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లోకేశ్​ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్​సేతుపతి, ఫహాద్​ ఫాజిల్​ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీతో పాటు శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'ఇండియన్​ 2'లోనూ కమల్​ నటించనున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News