Kalyaan Dhev Daughter : నవిష్క నా కూతురు.. ఆమె నా ప్రపంచం.. ఏడిపించేస్తోన్న కళ్యాణ్‌ దేవ్ పోస్ట్

Kalyaan Dhev Daughter కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన కూతురు బర్త్ డే అంటూ కళ్యాణ్‌ దేవ్ వేసిన పోస్ట్ అందరినీ టచ్ చేస్తోంది. తన కూతురే తన ప్రపంచం అని చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 10:29 PM IST
  • కూతురిని తలుచుకుంటూ కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్
  • శ్రీజ కొణిదెలకు దూరంగా బతుకుతున్న కళ్యాణ్‌ దేవ్
  • విడాకులపై మరోసారి నెటిజన్లకు క్లారిటీ వచ్చినట్టే?
Kalyaan Dhev Daughter : నవిష్క నా కూతురు.. ఆమె నా ప్రపంచం.. ఏడిపించేస్తోన్న కళ్యాణ్‌ దేవ్ పోస్ట్

Kalyaan Dhev Daughter Navishka Birthday కళ్యాణ్ దేవ్, శ్రీజ కొణిదెల గత ఏడాది నుంచి వేర్వేరుగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అందరికీ ఈ విషయం అర్థమైంది కూడా. కానీ ఏనాడూ కూడా ఈ ఇద్దరూ తమ బంధం మీద క్లారిటీ ఇవ్వలేదు. విడాకులు తీసుకున్నారా? దూరంగా ఉంటున్నారా? అనే వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది.

మధ్య మధ్యలో కళ్యాణ్‌ దేవ్ తన కూతురు నవిష్కతో కలిసి కనిపిస్తాడు. ఆ మధ్య అయితే ఎప్పుడూ కూడా శ్రీజ వద్దే నవిష్క కనిపించేది. ఇక నవిష్క ఎప్పటికీ శ్రీజ వద్దే ఉంటుందేమో అని అనుకున్న సమయంలోనే కళ్యాణ్ దేవ్‌తో ఆడుతూ కనిపించింది. అలా ఈ పాప విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఓ అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ కళ్యాణ్‌ దేవ్ ఇప్పుడు వేసిన ఈ పోస్ట్‌ చూస్తే అది కూడా తప్పే అని అర్థమవుతోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

తాజాగా కళ్యాణ్ దేవ్ తన కూతురిని తలుచుకుంటూ ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వేసిన పోస్ట్‌తో అందరినీ ఏడిపించేశాడు కళ్యాణ్ దేవ్. నా గుండె, నా ఆత్మ, నా జీవితంలో దొరికిన, జరిగిన గొప్ప విషయం ఏదైనా ఉంటే అది నా కూతురే. నా నవ్వుకి కారణం తనే.. ఆమె నా కూతురు.. ఆమె నా ప్రపంచం.. నేడు పాప పుట్టిన రోజు.. హ్యాపీ బర్త్ డే.. నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు.. లవ్యూ.. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను..నిన్ను చూడక చాలా రోజులు అవుతోంది.. అంటూ ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్‌ దేవ్.

ఇక ఈ పోస్ట్‌ను చూసిన ఎవ్వరికైనా కూడా శ్రీజ, కళ్యాణ్‌లు విడిపోయారని స్పష్టమవుతోంది. ఒక వేళ కలిసి ఉంటే.. తన కూతురిని తాను చూసుకోకుండా ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉంటాడు.. దూరంగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మొత్తానికి ఈ విడాకుల విషయం మీద వీరెప్పుడు అధికారికంగా స్పందిస్తారో చూడాలి.

Also Read : Kushi Re Release Trailer : ఖుషి, ఒక్కడు రీ రిలీజ్.. ట్రైలర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఏది బెటర్ అంటే?

Also Read : Bigg Boss Ashu Reddy : అనాథ పిల్లల్ని చదివిస్తున్న అషూ రెడ్డి.. అందరినీ గెలిచేసిన బిగ్ బాస్ బ్యూటీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News