Kalki - Prabhas: ప్రభాస్ 'కల్కి' మూవీ నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటో వైరల్..

Prabhas - Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. గతేడాది 'ఆదిపురుష్‌' 'సలార్' మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 8, 2024, 06:45 AM IST
Kalki - Prabhas: ప్రభాస్ 'కల్కి' మూవీ నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటో వైరల్..

Prabhas - Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా 'సలార్' మూవీతో పలకరించారు. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. 2023 ఇయర్ ఎండ్‌లో విడుదలైన 'సలార్' మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే అందరు అనుకున్నట్టుగా 'సలార్' మూవీ రూ. వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్ కాలేకపోయింది. ఓవరాల్‌గా రూ. 700 కోట్ల గ్రాస్ వరకు వచ్చి ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించారు. లాస్ట్ ఇయర్ చివర్లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక కన్నడ, ఇతర భాషల్లో పెద్దగా పర్ఫామ్‌ చేయలేదు. ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా  'సలార్' మూవీ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అటు హిందీ వెర్షన్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ప్రభాస్ నటించిన 'సలార్' మూవీని స్పానిష్ భాషలో డబ్ చేసి లాటిన్ అమెరికా దేశాల్లో రిలీజ్ చేసారు. మరోవైపు 'సలార్' మూవీని జపాన్‌ దేశంలో సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు..శత్రువులుగా ఎలా మారారనే కథాంశంతో తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక సలార్ రెండో పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.

ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ ప్యాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ మూవీని ముందుగా ఈ యేడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే డేట్‌లో వైజయంతీ మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', మహానటి సినిమాలు విడుదలై సంచలన విజయాలు సాధించాయి. అదే కోవలో 'కల్కి 2898 AD' మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ బలంగా నమ్ముకుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇటలీ షెడ్యూల్ కంప్లీటైంది. ప్రభాస్, దిశా పటానీలపై ఇటలీలోని 'సార్డినియా' ద్వీపంలో ఓ పాటను పిక్చరైజ్ చేసారు. అక్కడ ప్రభాస్, దిశా పటానీలు గడ్డ కట్టే చలిలో ఓ పాటను పిక్చరైజ్ చేశారు. అక్కడ ప్రభాస్, దిశా పటానీలు అక్కడ దిగిన ఫోటోను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. అక్కడ షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ భారత్‌కు తిరిగి వచ్చింది.  ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాలతో 'కల్కి' షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అటు కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే దీపికాకు సంబంధించిన షూట్ కంప్లీటైంది.

ఇక 'కల్కి' మూవీ మహాభారతంతో మొదలై 2898 ADతో ముగుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.నాటి రోజులకు తగ్గట్టు భారతీయత ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా యూనిట్ క్రియేట్ చేసింది.మరోవైపు ప్రభాస్ 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు.ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ రాబోతున్నటు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది.  అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్ మూవీ ఉండనే ఉంది. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్నట్టు సమాచారం. అటు కన్నప్ప సినిమాలో ప్రభాస.. మహా శివుడి పాత్రలో  కనిపించనున్నారు.  

Read More: Dried Fruit: ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు..‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News