Kalki Movie Pre Release Business: ప్రభాస్ ‘కల్కి’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రెబల్ స్టార్ ముందు పెద్ద టార్గెటే ఉందిగా..

Kalki Movie Pre Release Business: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతి సినిమాకు తన మార్కెట్ పరిధిని  పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా ఈయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.

Last Updated : Jun 25, 2024, 03:56 PM IST
Kalki Movie Pre Release Business: ప్రభాస్ ‘కల్కి’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రెబల్ స్టార్ ముందు పెద్ద టార్గెటే ఉందిగా..

Kalki Movie Pre Release Business: లాస్ట్ ఇయర్ ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ మూవీతో ప్రభాస్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 350 కోట్ల షేర్ (రూ. 700 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీకి ప్రభాస్ ఫ్యాక్టర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొణే, దిశా పటానీలు కూడా యాక్ట్ చేస్తున్నారు. మొత్తంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వార ఊచకోత కోస్తోంది. ‘సలార్’ మూవీ కేవలం $2 మిలియన్స్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేస్తే.. కల్కి మూవీ ఇప్పటికే 3 మిలియన్స్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ సినిమా ఓవరాల్ గా ఫస్ట్ డే కలుపుకుంటే $5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఓ వారం రోజులు పాటు టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటుతో పాటు మొదటి మూడు రోజులు అదనపు షోలకు పర్మిషన్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాకు తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం అని చెబుతున్నారు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

నైజాం (తెలంగాణ)లో రూ. 70 కోట్లు..
సీడెడ్ (రాయలసీమ)లో రూ. 27 కోట్లు..
ఉత్తరాంధ్ర (ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్).. రూ. 24 కోట్లు..
తూర్పు గోదావరి.. రూ. 11 కోట్లు..
పశ్చిమ గోదావరి.. రూ. 12.50 కోట్లు..
కృష్ణ .. రూ. 13 కోట్లు..
నెల్లూరు.. రూ. 7.50 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

కర్ణాటక విషయానికొస్తే.. రూ. 28 కోట్లు
తమిళనాడులో.. రూ. 16 కోట్లు..
కేరళలో.. రూ. 6 కోట్లు..
హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 85 కోట్ల
ఓవర్సీస్.. రూ. 70 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 385 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 388 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా ప్రభాస్ ‘కల్కి 2898 AD’ ముందు పెద్ద టార్గెటే ఉందని చెప్పాలి. మొత్తంగా కల్కి మూవీకి యూనామస్ టాక్ వస్తే కానీ ఈ సినిమాకు ఈ రేంజ్ రికవరి సాధ్యం కాదు. చూడాలి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లను రాబడుతోందో చూడాలి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News