Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు

Tollywood Heroines Remuneration: కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం తీవ్రం అవడంతో ప్రభుత్వం మార్చి నుంచి లాక్‌డౌన్ ( Lockdown ) ప్రకటించి అనంతరం అన్‌లాక్ ( Unlock ) ప్రక్రియ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీని ప్రభావం సినీ పరిశ్రమపై పడింది. ఒకవైపు థియేటర్లు మూతబడి ఉండటంతో సిద్ధంగా ఉన్న సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు.

Last Updated : Jul 18, 2020, 12:19 PM IST
Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు

Heroines Remuneration: కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం తీవ్రం అవడంతో ప్రభుత్వం మార్చి నుంచి లాక్‌డౌన్ ( Lockdown ) ప్రకటించి అనంతరం అన్‌లాక్ ( Unlock ) ప్రక్రియ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీని ప్రభావం సినీ పరిశ్రమపై పడింది. ఒకవైపు థియేటర్లు మూతబడి ఉండటంతో సిద్ధంగా ఉన్న సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. కరోనావైరస్ సంక్రమణ పెరుగుతుందేమో అనే భయంతో షూటింగ్‌లు మొదలు అవ్వడం లేదు. ఇక కొత్త సినిమాలు ప్రారంభం అవ్వడం లేదు. ఇలాంటి సమయలో నిర్మాతలు (  Film Producers ) కూడా భారీ పారితోషికం తీసుకునే తారల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. దాంతో కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) , రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా తమ పారితోషికం తగ్గించుకుంటున్నారు.  Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

కాజల్ అగర్వాల్..( Kajal Agarwal Remuneration )
చందమామ ( Chandamama ) సినిమాతో తెలుగు కుర్రకారు మనసులో కాజూగా ఫిక్స్ అయిపోయింది కాజల్ అగర్వాల్. తరువాత మగధీర (Magadheera ), బిజినెస్‌మేన్ (Businessman ) సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దాంతో ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేసింది ఈ అమ్మడు. అయితే కరోనావైరస్ ( Covid-19 )  ప్రభావంతో పాటు కొత్త హీరోయిన్స్‌తో పోటీవల్ల ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ను ఒక కోటికి కుదించుకోవడానికి కూడా సిద్ధం అయింది కాజల్.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh )
నాన్నకు ప్రేమతో ( Nannaku Prematho ), ఖాకీ ( Khakhi ) ఇలా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల లిస్ట్ చాలా పెద్దదే. ఒక వైపు సినిమాలు మరో వైపు యాడ్ ఫిల్మ్, మరో వైపు జిమ్ బిజినెస్‌తో  దూసుకెళ్లింది రకుల్ ప్రీత్ సింగ్. దాంతో పాటు తన పారితోషికం విషయంలో కూడా ఎప్పుడూ కాంప్రమైజ్ కాకుండా ప్రతీ సినిమాకు రూ.60 లక్షల నుంచి కోటి వరకు చార్జ్ చేసేది రకుల్. అయితే ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 వ్యాప్తి పరిస్థితిలో ఈ అమ్మడు తన పారితోషికంలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి 30-40 లక్షలకు సినిమా చేయడానికి సిధ్ద పడుతోందని సమాచారం.
Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..

Follow us on twitter

Trending News