Evaru meelo koteeswarudu: ఎవరు మీలో కోటీశ్వరుడు షో..జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా

Evaru meelo koteeswarudu: మీలో ఎవరు కోటీశ్వరుడు కాదు..ఎవరు మీలో కోటీశ్వరుడు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఇంతకీ ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2021, 11:04 PM IST
  • జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరుడు షో త్వరలో ప్రారంభం
  • ఏప్రిల్ నెలాఖరులో లేదా మే తొలివారంలో జెమిానీ టీవీలో ప్రసారం
  • ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 7.5 కోట్లు
Evaru meelo koteeswarudu: ఎవరు మీలో కోటీశ్వరుడు షో..జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా

Evaru meelo koteeswarudu: మీలో ఎవరు కోటీశ్వరుడు కాదు..ఎవరు మీలో కోటీశ్వరుడు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఇంతకీ ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా..

యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ) మరోసారి టీవీ షోలో కన్పించబోతున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 1(BiggBoss Season 1)కు హోస్ట్ చేసి అందర్నీ ఆలరించిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. కౌన్ బనేగా క్రోర్‌పతి తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తెలుగులో కూడా పాపులర్ అయింది.  నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించిన ఈ షో బాగా హిట్ అయింది. అయితే ఇప్పుడు ఇదే షోను కొన్ని మార్పులు చేసి..ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రారంభించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ షోని హోస్ట్ చేయబోతున్నాడు. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా. 7.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. గతంలో బిగ్‌బాస్ హోస్ట్‌గా చేసినప్పుడు 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ షోను 60 ఎపిసోడ్‌లుగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ నెలాఖరు లేదా మే తొలివారంలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. 

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు నాగార్జున 4.5 కోట్లు తీసుకోగా..చిరంజీవి (Chiranjeevi) అత్యధికంగా 9 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్7.5 కోట్లు తీసుకోబోతున్నాడు.

Also read: Chaavu Kaburu Challaga Release Date: చావు కబురు చల్లగా మూవీ రిలీజ్ డేట్ ప్రమోషన్లతో బస్తీ బాలరాజు కార్తికేయ బిజీబిజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News