Aryan Khan’s Bail Surety: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో (Mumbai Cruise Drug Case) అరెస్టు అయిన షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. మరికొద్ది గంటల్లో అతడు జైలు నుంచి విడుదల కానున్నాడు. ఈ నేపథ్యంలో తన కొడుకు ఆర్యన్ ఖాన్ ను ఇంటికి తీసుకొచ్చేందుకు ఆర్థర్ రోడ్ జైలుకు షారుక్ చేరుకున్నాడు. అటు ఆర్యన్‌కు బెయిల్ రావడంతో షారుక్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అతడు విడుదలై వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున షారుక్ నివాసం మన్నత్‌కు చేరుకున్నారు.
జూహీ చావ్లా పూచీకత్తుతో..
డ్రగ్స్ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులను న్యాయస్థానం నేడు జారీ చేసింది. మొత్తం 14 షరతులు విధిస్తూ ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చింది. ఇందులో రూ.లక్ష బాండ్ ఒకటి. ఈ బాండ్‌కు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా (Juhi Chawla Surety For Aryan Khan) సంతకం చేశారు. కోర్టు ఉత్తర్వులను తీసుకుని షారుక్ న్యాయ బృందం ఇప్పటికే జైలుకు బయల్దేరింది. అధికారిక లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత ఆర్యన్‌ను విడుదల చేసే అవకాశముంది.
Also Read: Manchu Lakshmi Tweet: పునీత్ రాజ్ కుమార్ మృతిపై మంచు లక్ష్మి ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
Also Read: Puneet Rajkumar Died: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి.. శోకసంద్రంలో అభిమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook