అభిమానులకు జూ. ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్

ఆరోజే జూ. ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల

Last Updated : May 17, 2018, 08:03 PM IST
అభిమానులకు జూ. ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తొలిసారి కలిసి చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల తేదీలపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే, తాజాగా ఆ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ తారక్ బర్త్ డే సందర్భంగా మే 19న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ కలిపి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. వాస్తవానికి తారక్ పుట్టిన రోజు మే 20వ తేదీ అయినప్పటికీ.. అంతకన్నా ఒక రోజు ముందే ఈ టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ సినిమాను నిర్మిస్తున్న హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ స్వయంగా ఈ వివరాలను వెల్లడించినట్టు సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్ లోనే పలు కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. 

Trending News