Devara Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ 'దేవర' స్పెషల్ వీడియో.. మీరు ఓ లుక్కేయండి..

Devara Movie: మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'దేవర'. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో ఓపెన్ చేస్తే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2023, 03:44 PM IST
Devara Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ 'దేవర' స్పెషల్ వీడియో.. మీరు ఓ లుక్కేయండి..

 Jr. Ntr's Devara Movie Special Video: యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'(Devara Movie). ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ రెండు భారీ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్స్ తారక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. 2024 ఏప్రిల్ 05న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను పంచుకున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ కు ఇంకా 250రోజులు ఉందంటూ.. కొరటాల వాయిస్‌ ఓవర్‌తో ఉన్న ఓ వీడియోను చిత్రయూనిట్ ఫ్యాన్స్ తో పంచుకుంది. వీడియో ఓపెన్ చేస్తే..  కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలే ఉంటాయి. ఆ మృగాలకు భయమంటే తెలియదు. దేవడంటే భయం లేదు. చావలంటే అసలు భయం లేదు. కానీ ఒకటంటే చాలా భయం. అది దేవర అంటూ అప్పుడెప్పుడో ఓ ప్రెస్‌మీట్‌లో కొరటాల చెప్పిన మాటలతో వీడియోను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట విపరీతంగా వైరల్ అవుతోంది. 

Also Read: Sanjay Dutt First look: 'డబుల్ ఇస్మార్ట్‌'లో సంజయ్ దత్.. అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..

యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటిస్తుంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ విలన్ గా నటిస్తున్నాడు. సముద్రం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. 

Also Read: BRO Movie: జోరు తగ్గిన 'బ్రో' కలెక్షన్స్.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News