తనయుడు భార్గవ్ రామ్‌తో తారక్.. వైరల్ అవుతున్న లవ్లీ ఫోటో

ఇక తారక్ లేటెస్ట్ సినిమాల అప్‌డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా ముగించుకున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటించాల్సి ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 11:25 PM IST
  • తన కొడుకు భార్గవ్ రామ్‌తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్
  • విదేశీ పర్యటనలో తారక్ కుటుంబసభ్యులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ ఫోటో
తనయుడు భార్గవ్ రామ్‌తో తారక్.. వైరల్ అవుతున్న లవ్లీ ఫోటో

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, తన కొడుకు భార్గవ్ రామ్‌తో కలిసి తీసుకున్న ఓ లవ్లీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. తారక్ తన వారసుడు భార్గవ్ రామ్‌ని ముద్దులతో ముంచెత్తుతూ మురిసిపోతుండగా తీసిన లవ్లీ ఫోటో ఇది. అందుకే ఈ ఫోటోకు ఎక్కడా లేనంత క్రేజ్ ఏర్పడింది.

తారక్ ఇటీవలె ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తన భార్య లక్ష్మీ ప్రణతి, తనయుడు భార్గవ్ రామ్‌తో కలిసి ఈఫిల్ టవర్ అందాలు చూసి మురిసిపోయిన తారక్ పలు ఇతర ప్రదేశాల్లో సైతం పర్యటించినట్టు సమాచారం. ఈ విదేశీ పర్యటనలో ఉండగానే తండ్రీ, కొడుకుల ముద్దులాటను లక్ష్మీ ప్రణతి ఈ ఫోటోను తన కెమెరాలో బంధించినట్టు టాక్. 

ఇక తారక్ లేటెస్ట్ సినిమాల అప్‌డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా ముగించుకున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటించాల్సి ఉంది. 

Also read : ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదేనా ?

ఆ ఇద్దరు దర్శకుల ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. కొరటాల శివ ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటుండగా.. ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సలార్ మూవీని తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు.

Also read : శ్యామ్ సింగ రాయ్ హిందీ డబ్బింగ్ రైట్స్‌కి భారీ ధర

Also read : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి మరో అప్డేట్.. ‘జనని’ పాట రిలీజ్ ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News