RRR Runtime: ఆర్‌ఆర్‌ఆర్‌ సెన్సార్‌ పూర్తి.. షాకింగ్ రన్‌టైమ్! బాహుబలి-2 కంటే ఎక్కువ!!

RRR Movie Sensor and Runtime. ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 6 నిమిషాల 54 సెకన్‌లు ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 10:30 AM IST
  • ఆర్‌ఆర్‌ఆర్‌ సెన్సార్‌ పూర్తి
  • ఆర్‌ఆర్‌ఆర్‌ షాకింగ్ రన్‌టైమ్
  • బాహుబలి 2 కంటే 20 నిముషాలు ఎక్కువ
RRR Runtime: ఆర్‌ఆర్‌ఆర్‌ సెన్సార్‌ పూర్తి.. షాకింగ్ రన్‌టైమ్! బాహుబలి-2 కంటే ఎక్కువ!!

RRR Movie Sensor complete, Runtime is 3 hours 6 minutes 54 seconds: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరోలుగా నటించిన సినిమా రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రతిఒక్కరు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

తాజాగా పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ రన్‌టైమ్ కూడా తెలిసింది. ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 6 నిమిషాల 54 సెకన్‌లు ఉంది.  ఇంటర్వెల్‌తో కలుపుకుని దాదాపుగా మూడు గంటల 20 నిముషాలు ప్రేక్షకులు థియేటర్లలో ఉండనున్నారు. సినిమా రన్ టైమ్ పెద్దగా ఉండడంతో ప్రతిఒక్క థియేటర్లలో షో టైమింగ్స్ కూడా మారిపోనున్నాయి. ఆరంభం రోజుల్లో 5 షోలు ప్రదర్శితం అవుతాయి కాబట్టి ఉదయం ముందుగానే షోలు పడనున్నాయి. 

దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి గత చిత్రం 'బాహుబలి ది కంక్లూజన్' రన్‌టైమ్ 2 గంటల 47 నిమిషాలు. బాహుబలి-2 సినిమా కంటే ఆర్ఆర్ఆర్ రన్‌టైమ్ ఎక్కువగా ఉంది. బాహుబలి 2 కంటే ఆర్ఆర్ఆర్ రన్‌టైమ్ 20 నిముషాలు ఎక్కువ. రన్‌టైమ్ ఎక్కువైనా అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్ ఇద్దరూ స్క్రీన్‌పై కనిపిస్తే ఆ క్రేజ్ వేరు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. 

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆర్ఆర్ఆర్ భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని, మూడు వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేస్తుందని చెప్పారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదల అవుతోంది. అమెరికాలో అయితే 24నే విడుదల అవనుంది. భారత్‌లో ఐదు భాషల్లో సినిమా విడుదల అవుతోన్న ఈ సినిమా దేశవ్యాప్తంగా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. 

Also Read: Gold ATM: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు!!

Also Read: Bheemla Nayak OTT: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భీమ్లానాయక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News