Jr NTR with Hrithik Roshan: మాస్ కాంబో సెట్.. హృతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్.. వార్2 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్

Jr NTR in War2: బాలీవుడ్ సినిమా వార్ సూపర్ హిట్ అవగా దాని సీక్వెల్ వార్ 2లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు అని తెలుస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 8, 2023, 08:29 AM IST
Jr NTR with Hrithik Roshan: మాస్ కాంబో సెట్.. హృతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్.. వార్2 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్

Jr NTR in War2 with Hrithik Roshan & Tiger Shroff: ప్రస్తుతం ఒక భాషకు చెందిన హీరోలు మరో భాష హీరోతో కలిసి మల్టీస్టారర్లు చేస్తున్న ట్రెండ్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ హీరోలు, తెలుగు సినిమాల్లో భాగమవుతూ ఉండగా తెలుగు హీరోలు సైతం బాలీవుడ్ సహా ఇతర భాషల సినిమాల్లో భాగమవుతున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారు అనే వార్త అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరినీ అలరిస్తుంది.

తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్తో భారీ మల్టీస్టారర్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవెల్ లో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు అటు రాంచరణ్ ఇటు ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో యష్ రాజ్ ఫిలిమ్స్ కి చెందిన వార్ సినిమా సీక్వెల్ వార్ 2 తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Also Read: Happy Birthday Rashmika Mandanna: మూడు డిగ్రీలు..12 ఏళ్ల చెల్లె..రష్మిక గురించి ఈ విశేషాలు తెలుసా?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని బ్రహ్మాస్త్ర సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టుగా అందరికీ పరిచయం ఉన్న తరణ్ ఆదర్శ్ ప్రకటించారు. ఇట్స్ అఫీషియల్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వార్  2లో కలిసి నటిస్తున్నారు.

యష్ రాజ్ ఫిలిమ్స్ క్యాస్టింగ్ వేరే లెవల్ కి తీసుకెళ్తోంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొట్టమొదటిసారిగా కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు అంటూ తరణ్ ఆదర్శ్ ప్రకటించారు. అయితే ఈ సినిమా యూనిట్ నుంచి కానీ దర్శకుడి నుంచి కానీ హీరోల నుంచి కానీ ఈ అంశానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు బయటకు వస్తుందనేది.

Also Read: Rashmika Mandanna top 10 movies: పుష్ప, వారసుడు సహా రష్మిక కెరీర్లో టాప్ టెన్ సినిమాలివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News