Jr NTR Wife : అలాంటి ఫోటోను షేర్ చేశాడేంటి?.. భార్యను కౌగిట్లో బంధించిన ఎన్టీఆర్

Jr NTR Family ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ప్రారంభించేందుకు కాస్త టైం పట్టేలా ఉంది. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీని తీసుకుని అలా వెకేషన్‌కు వెళ్లాడు. అక్కడ తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చెప్పేందుకు ఇలా ఫోటోను షేర్ చేసినట్టున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 10:31 AM IST
  • విదేశాల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ చిల్
  • భార్యను కౌగిట్లో బంధించిన ఎన్టీఆర్
  • సంక్రాంతికి కొత్త సినిమా షురూ?
Jr NTR Wife : అలాంటి ఫోటోను షేర్ చేశాడేంటి?.. భార్యను కౌగిట్లో బంధించిన ఎన్టీఆర్

Jr NTR wife Lakshmi Pranathi in Vacation : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కొరటాల శివతో చేయబోయే సినిమాను ఎన్టీఆర్ ఎప్పుడు ప్రారంభిస్తాడా? అని అంతా చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ సినిమా ఆలస్యం అవుతూనే వస్తోంది. కొరటాల చెప్పిన కథకు ఇంకా మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. ఆచార్య ప్రభావంతో కొరటాల శివ మీద ఒత్తిడి మరింతగా ఎక్కువ అయింది. కథ మీద దృష్టిపెట్టమని ఎన్టీఆర్ సైతం కాస్త గట్టిగానే చెప్పాడట.

ఎన్టీఆర్ చివరకు కొరటాల చెప్పిన కథకు ఓకే చెప్పేశాడని, స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసేశాడని, సంక్రాంతికి ఈ సినిమాను ప్రారంభించబోతోన్నాడని తెలుస్తోంది. సంక్రాంతి వరకు గ్యాప్ ఉండటంతో ఇలా ఫ్యామిలీని తీసుకుని ఎన్టీఆర్ వెకేషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో అయితే ఎన్టీఆర్, ప్రణతి, భార్గవ్ రామ్ కనిపించారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

ఎన్టీఆర్ ఎక్కువగా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయడు. ఎప్పుడో సమయం సందర్భం చూసుకుని ఇలాంటి స్పెషల్ ఫోటోలను మాత్రం షేర్ చేస్తుంటాడు. తన భార్య,  పిల్లల ఫోటోలను ఎన్టీఆర్ అరుదుగా షేర్ చేస్తుంటాడు. తాజాగా ఎన్టీఆర్ ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో ఫోటో బ్లర్‌గా కనిపిస్తోంది.

ఈ ఫోటోను ఎవరు తీశారు? ఇలా బ్లర్‌గా ఉన్న ఫోటోను ఎందుకు షేర్ చేశారు? అంటూ జనాలు ఆరా తీస్తున్నారు. ఎన్టీఆర్ ఫోన్‌ని తీసుకుని భార్గవ్ ఇలా ఫోటో తీశాడా? అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మొత్తానికి భార్యను తన కౌగిట్లో బంధించేశాడు ఎన్టీఆర్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Avatar 2 Day 1 Collections : ఇండియాలో అవతార్ 2కు ఎదురుదెబ్బ.. రికార్డుల కొల్లగొట్టని జేమ్స్ కామెరాన్

Also Read : Avika Gor Pics : చిన్నారి పెళ్లికూతురు అందాల ప్రదర్శన.. అక్కడి టాటూ కనిపించేలా అవికా గోర్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News