Devara and Pushpa 2: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి చిత్రాలతో భారీ విజయం అందుకున్న.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. జనతా గ్యారేజ్ సినిమా వరకు వరుస విజయాలు అందుకున్న కొరటాల శివ ఆచార్య సినిమాతో ఘోర పరాభవాన్ని చవిచూశారు. ముఖ్యంగా రామ్ చరణ్ , చిరంజీవితో కలిసి తెరకెక్కించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.
అయితే దేవర సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు.. ఆచార్య నుంచి కొరటాల శివ బయటకు రాలేదని, కచ్చితంగా దేవర సినిమా డిజాస్టర్ అవుతుందని, దేవర, ఆచార్య రెండింటిని డిజాస్టర్ గానే చూడాలని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ముఖ్యంగా మెగా అభిమానులు కూడా కొరటాల ఆచార్య డిజాస్టర్ నుంచి.. బయటపడలేకపోతున్నాడు అంటూ కూడా పరోక్షంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినప్పటికీ కూడా ఆ నెగెటివిటీకి ఏమాత్రం లొంగకుండా.. తనను తాను నిరూపించుకున్నారు ఎన్టీఆర్. ముఖ్యంగా మేము చూస్తేనే ఫలానా హీరోల సినిమాలు ఆడతాయి, మేము ఆపితే ఆగిపోతాయి. మేము నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తే డిజాస్టర్ అవుతాయి. అనే ఆలోచన నుంచి అభిమానులు బయటకి రావాలి. హీరోలలో దమ్ము ఉండి, మాస్ ప్రేక్షకులకు సినిమా నచ్చితే బ్రహ్మరథం పడతారు. ఇక ఎవరు ఏం చేసినా వసూళ్ళు ఆగిపోవు.. అలా అనుకునే వారందరికీ దేవర సినిమా పై దెబ్బగా చెప్పుకోవచ్చు. ఏకంగా ఆరు రోజుల్లోనే రూ.396 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది దేవర.
మరొకవైపు పుష్ప 2 సినిమాపై కూడా విమర్శలు భారీగా వెళ్లవెత్తుతున్న విషయం తెలిసిందే..పవన్ కళ్యాణ్ కు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సపోర్టు చేయకపోవడం, పైగా వైసిపి నేతకు సపోర్టు చేయడమే కాకుండా ఇటీవల తన భార్య అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా వైసిపి నేత కనిపించడం మెగా , కూటమి ఫ్యాన్స్ కు మింగుడు పడలేదు. దీంతో ఎలాగైనా సరే పుష్ప 2 సినిమా డిజాస్టర్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఎన్నో నెగెటివిటీల మధ్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దేవర రికార్డు చూసి పుష్పరాజ్ డబ్బులు హ్యాపీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నార్త్ లోనే కాదు యూఎస్ఏ లో కూడా దేవర సంచలనం క్రియేట్ చేసింది. మొత్తానికైతే దేవరా ఫలితం పుష్ప రాజ్ కి డబుల్ సంతోషాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుంది అనడంలో సందేహం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని
Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి