Jr NTR Charging Less Remuneration For Ads: ఈ మధ్య తెలుగు హీరోలు వరుసగా సినిమాలు చేస్తూనే మరో పక్క కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపిస్తున్నారు. కొంత మంది ఆయా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటే మరి కొందరు మాత్రం అలాంటివి చేయకపోయినా సైలెంట్ గా యాడ్స్ వరకు చేసి ఊరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బన్నీ విషయానికి వస్తే ఎక్కువగా ఆయన డామినేషన్ కనిపిస్తోంది. రెడ్ బస్, జొమాటో సహా పలు వేరువేరు సంస్థలకు వారు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇక రాంచరణ్ కూడా మీషో, శుభ గృహ వంటి ప్రాజెక్టులకు యాడ్స్ కూడా చేశారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా లిసియస్ అనే ఒక మాంసం హోమ్ డెలివరీ యాప్ కు ఒక యాడ్ చేశారు. ఆ యాడ్ ఈరోజు రిలీజ్ అయింది, ఈ యాడ్లో దానికి మంచి రెస్పాన్స్ కూడా లభిస్తోంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎంత రెమినేషన్ తీసుకుంటున్నారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఒక్కో యాడ్ చేయడానికి సుమారు 8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తుండగా, రాంచరణ్ ఒక్క యాడ్ చేయడానికి 7 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని అంటున్నారు.
అయితే తారక్ మాత్రం లిసియస్ యాడ్ చేసేందుకు కేవలం రెండు కోట్లు మాత్రమే ఛార్జ్ చేశారనే వాదన వినిపిస్తోంది. అంటే తారక్ స్టామినా వారి కంటే తక్కువ అనే చర్చ జరుగుతుంది.. కానీ అసలు విషయం ఏమిటంటే బన్నీ అలాగే రామ్ చరణ్ వంటి వారు చేస్తున్న యాడ్స్ అన్ని నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ప్రచారం జరుగుతూ ఉంటాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ చేసింది తెలుగు వరకే అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కవర్ చేసుకుంటున్నారు.
అయితే మొత్తానికి ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలతో సూపర్ క్రేజ్ అందుకున్న ఈ హీరోలలో అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రమే దాన్ని వాడుకుంటున్నారని అందుకు ఎన్టీఆర్ ఆ క్రేజ్ వాడుకునేందుకు ఎందుకో సిద్ధంగా లేరనే వాదన వినిపిస్తోంది. సినిమాల విషయంలో కూడా పుష్ప తర్వాత అల్లు అర్జున్ పుష్పా 2 లైన్లో పెట్టారు. రామ్ చరణ్ కూడా రామ్ చరణ్ 15, అలాగే ఇప్పుడు రామ్ చరణ్ 16 కూడా లైన్ లో పెట్టినట్లు చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా విషయం మీద ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అయితే టెన్షన్ నెలకొంది, కొత్తగా ఈ వార్త కూడా తెర మీదకు రావడం అనేది హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Ashu Reddy Hot Photos: మంచమేసి దుప్పటేసి.. సైజులు చూడండంటూ అషు రెడ్డి ఫ్రీ షో!
Also Read: Shock to Samantha: నాగచైతన్య పుట్టినరోజు నాడే సమంతకు ఊహించని షాకిచ్చిన కోర్టు!