Jr NTR: హాట్ టాఫిక్ గా ఎన్టీఆర్ ఖరీదైన కారు...దేశంలో తొలి వ్యక్తిగా రికార్డు

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన కారు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. ఖరీదైన లగర్జీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తి నిలిచాడు తారక్. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2021, 11:00 AM IST
  • ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన జూ.ఎన్టీఆర్
  • దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డు
  • కారు ధర రూ. 3.16కోట్లు
Jr NTR: హాట్ టాఫిక్ గా ఎన్టీఆర్ ఖరీదైన కారు...దేశంలో తొలి వ్యక్తిగా రికార్డు

Jr NTR: సినీ సెలబ్రెటీలకు ఖరీదైన కార్లు, వస్తువులు అంటే మక్కువ ఎక్కువ. మార్కెట్లోకి కొత్తగా ఏది లాంచ్ అయినా ముందుగా వాళ్లే కొనాలనుకుంటారు. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి వెనుకాడరు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొనుగోలు చేసిన కారు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. ఖరీదైన లగర్జీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తి నిలిచాడు తారక్(Tarak). 

కాగా ఇటీవల తారక్‌ అంత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్(lamborghini urus) కారును ఖరీదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో లాంచ్‌ అయిన తొలి రోజే ఈ కారును తారక్ బుక్‌ చేసుకున్నాడు. 3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్ఘినీ ఊరుస్‌ బుధవారం ఇటలీ(Italy) నుంచి శంషాబాద్‌ ఎయిరపోర్టుకు ఆ తర్వాత తారక్‌ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం దీని ఫొటోలు సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఇటలీకి చెందిన వోక్స్‌ వాగన్‌(Volkswagen) కంపెనీ అనుబంధ సంస్థయే ‘లంబోర్ఘిని’. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా.. ఇండియాలో సోమవారం రోజున దీనిని అధికారింగా లాంచ్‌ చేశారు.

Also Read: ​katrina kaif secret engagement: విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సీక్రెట్ ఎంగేజ్మెంట్ ?

ఈ కారు ప్రత్యేకతలు..
ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్‌ అట. ఇక బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. 200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కి.మీ తగ్గించినా ఎలాంటి ఒడిదుడుకులు లోను కాదట. అంతేకాదు ఇందులో ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్‌ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్‌లు కానీ అంత ఈజీ తెరచుకోవట. ఫుల్లీ ఆటోమెటెడ్‌, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు.  దీంతో ఎన్టీఆర్‌(Jr NTR) లంబోర్ఘీన ఊరుస్‌ ఇప్పుడు టాలీవుడ్‌(Tollywood)లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌ గ్యారేజ్‌ 20పైగా కార్లు ఉన్నాయట. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News