Naatu Naatu Performance At 95th Oscar ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించడంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఆస్కార్ నామినేషన్స్‌లోకి కూడా వెళ్లడంతో అదొక చరిత్రగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్‌ను లైవ్‌గా పర్ఫామెన్స్ చేయబోతోన్నారట. ఈ మేరకు సింగర్లు లాస్ ఏంజిల్స్ వద్ద సందడి చేయబోతోన్నారు.
రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవలు స్టేజ్ మీద పాటను పాడుతారట. అయితే ఇదే ఊపులో అక్కడే స్టేజ్ మీద రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందనే ఊహతోనే ఇరు హీరోల అభిమానులు గాల్లో తేలిపోతోన్నారు. లైవ్ మ్యూజిక్‌తో పాటుగా, లైవ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉంటుందా? లేదా? అన్నది మాత్రం తెలియడం లేదు.
మొత్తానికి ఈ 95వ ఆస్కార్ వేడుకల్లో మాత్రం భారత సినీ పరిశ్రమ చరిత్ర సృష్టించేలానే కనిపిస్తోంది. నాటు నాటుకు ఆస్కార్ అవార్డు వస్తుందని అంతా భావిస్తున్నారు. ధృడ నమ్మకంతో ఉన్నారు. దీని కోసం రాజమౌళి అండ్ టీం ఇన్నాళ్లుగా కష్టపడింది. అసలే ఈ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఒక వేళ ఆస్కార్ గనుక మిస్ అయితే రాజమౌళి కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ హాలీవుడ్ అడ్డాలో సందడి చేయడం, నందమూరి ఫ్యామిలీలో జరిగిన విషాదంతో ఎన్టీఆర్ ఇక్కడే ఉండటంతో సమీకరణాలు మారిపోయాయి. ఇంటర్నేషనల్ వైడ్‌గా రామ్ చరణ్ పేరు మార్మోగిపోతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్, మెగా అభిమానుల మధ్య మళ్లీ వార్ మొదలైన సంగతి తెలిసిందే.
గత వారం రోజులకు పైగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకల్లో రామ్ చరణ్ చేసిన సందడి, స్పాట్ లైట్ అవార్డు రావడం, అక్కడి ఫేమస్ షోల్లో రామ్ చరణ్ కనిపించడం, ఇలా ప్రతీ ఒక్కటి ఇక్కడ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
Also Read: Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook