NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

NTR 30 Update ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ చిత్రం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 12:35 PM IST
  • ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్
  • మార్చిలో మొదలెట్టనున్న ఎన్టీఆర్
  • కొరటాల శివకు ఎన్టీఆర్ డెడ్ లైన్
NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

NTR 30 Update ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత, ఆస్కార్ అందుకునే లెవెల్లో సత్తా చాటిన ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా మీద సహజంగానే అంచనాలుంటాయి. అందుకే వాటిని అందుకునేలా ప్రాజెక్ట్ ఉండాలని ఎన్టీఆర్ ఆశిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొరటాల శివను మంచి కథను రెడీ చేయమని, దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టాలని చెప్పినట్టున్నాడు. అసలే కొరటాల శివ ఆచార్య వంటి డిజాస్టర్ ఇచ్చి ఉన్నాడు.

దీంతో సహజంగానే కొరటాల మీద ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్రాజెక్ట్ ప్రకటించి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం తొందరపెట్టడం లేదు. స్క్రిప్ట్ సరిగ్గా రెడీ అయితేనే సెట్స్ మీదకు వెళ్దామని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం సినిమాకు డెడ్ లైన్ పెట్టినట్టు సమాచారం అందుతోంది.

కొరటాలతో సినిమా అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సమ్మర్ వరకు సలార్ పనులు పూర్తయ్యేలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ ఏడాది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. 

అంతలోపే ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్ట్ పూర్తవ్వాల్సిన అవసరం ఉంది. మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభించి.. ఆరు నెలల్లోనే షూట్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు. మార్చి 20 నుంచి రెగ్యులర్ స్టార్ట్ చేసేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందనే గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News