Antony OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ‘ఆంటోనీ’.. మలయాళం సూపర్ హిట్‌కు భారీ క్రేజ్

Antony Streaming in Aha: మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఆంటోనీ మూవీ తెలుగు వర్షన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆహాలో ఆడియన్స్‌ను అలరిస్తోంది. గతేడాది డిసెంబర్ 1న ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 23, 2024, 05:42 PM IST
Antony OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ‘ఆంటోనీ’.. మలయాళం సూపర్ హిట్‌కు భారీ క్రేజ్

Antony Streaming in Aha: జోజు జార్జ్ హీరోగా మ‌ల‌యాళ స్టార్ డైరెక్ట‌ర్ జోషి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆంటోనీ’. మలయాళంలో గతేడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాజిటివ్ రివ్యూలతోపాటు మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నైలా ఉషా, చెంబ‌న్ వినోద్ జోస్ తదితరులు కీరోల్స్ ప్లే చేశారు. మలయాళ వెర్షన్ ఓటీటీలోకి ఇప్పటికే వచ్చేయగా.. రీసెంట్‌గా ఈ మూవీ తెలుగు వెర్షన్‌ కూడా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: RX 100 Bike: గుడ్‌న్యూస్‌.. మళ్లీ రానున్న 'యమహా ఆర్‌ఎక్స్‌ 100'.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే

ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా.. ఆహాలో ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఆంటోనీ అనే గ్యాంగ్‌స్ట‌ర్‌ పాత్రలో జోజు జార్జ్ నటించాడు. తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయిగా కల్యాణి ప్రియదర్శన్ నటన ఆకట్టుకుంది. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్‌ను తెరపై చక్కగా ఆవిష్కరించారు డైరెక్టర్ జోషి. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న్స్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. రాజేష్ వర్మ కథ అందించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించగా.. సినిమాటోగ్రఫర్‌గా రెనాదివ్ పనిచేశారు. ఎడిటింగ్ బాధ్యతలు శ్యామ్ శశిధరన్ నిర్వర్తించారు.

కథ ఏంటంటే..?

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆంటోనీ (జోజు జార్జ్) రౌడీగా మారుతాడు. జేవియ‌ర్ అనే రౌడీని హత్య చేస్తారు. అయితే జేవియర్ కూతురు మ‌రియాకు (క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌)కు కొన్ని పరిస్థితులు వల్ల ఆంటోనీ సపోర్ట్‌గా ఉండాల్సి వస్తుంది. కానీ వీరిద్దరి బంధాన్ని ఊరి ప్రజలు తప్పుబడతారు. జేవియర్‌ను హత్య చేసింది ఆంటోనీ అని తెలిసినా.. అతని భార్య కోర్టులో నిజం చెప్పదు. ఆమె ఎందుకు నిజం చెప్పలేదు..? గ్రామస్తులు ఎందుకు ఆంటోనీని తప్పుబట్టారు..? మరియా తన నిజమైన తండ్రిని కలుసుకుందా..? అనే విషయాలు తెలియాలంటే ఆంటోనీ మూవీ తప్పకుండా చూడాల్సిందే. ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. 

Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News