శ్రీదేవి తనయ జాన్వీకపూర్ తొలి ఫోటో షూట్.. కెవ్వు కేకా !

Last Updated : Jun 10, 2018, 01:08 PM IST
శ్రీదేవి తనయ జాన్వీకపూర్ తొలి ఫోటో షూట్.. కెవ్వు కేకా !

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీకపూర్ సినిమాల్లో ఆరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే.  ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీకపూర్ తన మొట్ట మొదటి ఫొటో షూట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె వోగ్ మ్యాగ్ జైన్ ఫొటో షూట్ లో పాల్గొన్న వీడియోను పోస్ట్ చేసింది. 

‘హాయ్ గైస్...దిస్ ఈజ్ జాన్వీకపూర్

‘హాయ్ గైస్, దిస్ ఈజ్ జాన్వీకపూర్ అండ్ వెల్ కమ్ టూ మై ఫస్ట్ ఎవర్ వోగ్ షూట్’ అంటూ ఈ వీడియోలో అభిమానులను పలకరించింది. శ్రీదేవి వారసులురాలిగా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న జాన్వీ.. తన తల్లి ఎలాగైతే ఆదరించారో.. అశీర్వదించారో  తనను కూడా అలాగే చూడాలని అభిమాలను కోరుతోంది జాన్వీకపూర్. కాగా జాన్వీకపూర్ తొలి ఫొటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి.

 

జాన్వీ పలకరింపుతో ఫాన్స్ ఫిదా

కాగా జాన్వీకపూర్ తొలి పలకరింపుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. జాన్వీని చూస్తుంటే అచ్చం అమ్మలా ఉందని కొందరు.. మళ్లీ శ్రీదేవి రెండో ఇన్నింగ్ మొదలెట్టిందా అన్న రీతిలో ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  

Trending News