Jeevitha Rajasekhar: వాళ్లలానే నరేష్ చేతిలో మునిగిన జీవితా రాజశేఖర్.. నమ్మితే ఇదీ ఫలితం!

Jeevitha Rajasekhar Cheated: ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ జీవిత రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్లు దిమ్మతిరిగే షాక్  ఇస్తూ ఏకంగా లక్షన్నర కాజేసినట్టు తెలుస్తోంది. ఆ అంశానికి సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 26, 2022, 06:34 PM IST
Jeevitha Rajasekhar: వాళ్లలానే నరేష్ చేతిలో మునిగిన జీవితా రాజశేఖర్.. నమ్మితే ఇదీ ఫలితం!

Jeevitha Rajasekhar Cheated in JIO Scam: టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ భార్య ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ జీవిత రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జియో బహుమతుల పేరుతో జీవిత రాజశేఖర్ నుంచి లక్షన్నర రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. జియో బహుమతులు సగం ధరకే  ఇస్తామంటూ జీవిత రాజశేఖర్ ను చీట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలిసిన వారి పేరు చెప్పి జీవిత రాజశేఖర్ కు కేటుగాళ్లు టోకరా వేసినట్లు పోలీసులు గుర్తించారు.

తెలిసిన వాళ్ళు కదా అని నమ్మి లక్షన్నర జీవిత రాజశేఖర్ బదిలీ చేశారని ఆ డబ్బులు చెల్లించిన తర్వాత సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులను జీవిత రాజశేఖర్ ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన నరేష్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. ఇదే నరేష్ గతంలో నటీనటులతో పాటు ప్రొడ్యూసర్స్ ని కూడా మోసం చేసిన కేసులు అరెస్టై బెయిల్ మీద బయట ఉన్నట్లు గుర్తించారు.

జీవిత రాజశేఖర్ తన భర్త హీరోగా నటించిన శేఖర్ అనే సినిమాకి ఇటీవల దర్శకురాలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన జోసెఫ్ అనే సినిమాని తెలుగులో శేఖర్ పేరుతో రిలీజ్ చేశా.రు ఈ సినిమాలో శివాని రాజశేఖర్ కూడా ఒక కీలకపాత్రలో నటించింది. అయితే ఈ సినిమాని స్వయంగా రాజశేఖర్ దంపతులు నిర్మించారు కానీ కమర్షియల్ గా ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి రాజశేఖర్ హీరో గానే కొనసాగుతూ ఇంకా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇతర హీరోల సినిమాల్లో ఎలాంటి పాత్రలు వచ్చినా చేసేందుకు సిద్ధమేనని కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు. ఇక వీరిద్దరి కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ కూడా హీరోయిన్లుగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శివాత్మిక దొరసాని సినిమాతో లాంచ్ అయింది, శివాని రాజశేఖర్ కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఆమె హీరోయిన్గా నటించిన ఆహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ కూడా జి ఫైవ్ లో స్ట్రీమ్ అవుతోంది, ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు.

Also Read: Content is the King: చిన్నదా, పెద్దదా కాదు.. కంటెంట్ ఈజ్ ది కింగ్.. ఇదే లైవ్ ఎగ్జామ్‌పుల్!

Also Read: Pavitra Lokesh: అల్లరి చేస్తున్నారు, ఆపండి.. నరేష్ పేరు లాగుతూ 'సైబర్ క్రైం'కు పవిత్ర ఫిర్యాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News