ITC Nimyle Launches Clean Equal Mission: క్లీన్ ఈక్వల్ మిషన్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. మహిళల డబుల్స్ (టెన్నిస్) మాజీ ప్రపంచ నంబర్ 1 సానియా మీర్జా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. సానియా మీర్జాతో పాటు ఐటిసి లిమిటెడ్ మార్కెటింగ్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ శ్రీనివాస్, గీతాంజలి దేవ్‌శాల ప్రిన్స్‌పల్, గీతాంజలి గ్రూపు విద్యా సంస్థల డైరెక్టర్ మాధవి చంద్ర, కిరణ్మయి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సానియా మీర్జా మాట్లాడుతూ.. ఐటీసీ నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్‌లో భాగంగా ఉండడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇది భాగస్వామ్య బాధ్యత భావాన్ని పెంపొందించడం, ఆకట్టుకునే విధంగా చిన్న వయస్సు నుంచే సమానత్వం మనస్తత్వాన్ని పెంపొందించడానికి సంబంధించిన అంశం అని చెప్పారు.
మన సమాజంలో ఇంటి పనులు మహిళల భుజాలపైనే ఉంటాయని సానియా మీర్జా అన్నారు. కుటుంబాలలో ఇంటిని శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లలను చూసుకోవడం వంటి బాధ్యతలు ఎక్కువగా మహిళలకే అప్పగిస్తారని అన్నారు. కానీ వచ్చే జనరేషన్ శుభ్రపరచడంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు ఐటీసీ క్లీన్ ఈక్వల్ మిషన్‌ను రూపొందించిందని తెలిపారు. ఈ మిషన్ పిల్లల కోసం వినూత్నమైన విద్యా మాడ్యూల్‌ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తరం బాలలు శుభ్రంగా ఉండడం, పరిశుభ్రతకు సంబంధించిన ప్రాథమిక అంశాలతో పాటు స్వాతంత్ర్యం, సమానత్వపు లోతైన భావనతో ఎదిగేందుకు వీలు కల్పిస్తుందన్నారు.
నిమైల్ కార్యక్రమం పాఠశాల, తల్లిదండ్రులు వారి పిల్లల జీవితాలలో ఆకర్షణీయమైన, వయస్సుకు తగిన కార్యకలాపాల ద్వారా ఏకీకృతం చేయడంలో సహాయపడుతుందని మాజీ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ చెప్పుకొచ్చారు. నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ హైదరాబాద్‌లో మొదటి దశలో లక్ష కంటే ఎక్కువ మంది విద్యార్థులకు చేరువైందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రాబోయే కొద్ది నెలల్లో మన దేశంలో 8 లక్షల మంది విద్యార్థులకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook