Dil Raju: నాలుగో రోజు కొనసాగిన ఐటీ దాడులు..దిల్ రాజు నుండి కీలక పత్రాలు స్వాధీనం..!

Dil Raju ID Raid on Day 4: ఐటీ అధికారులు దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించి,  కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిసాయి అని వినిపించగా.. ఇది నిజం కాదని నాలుగవ రోజు కూడా.. ఈ రైడ్స్ కొనసాగుతున్నాయని తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 24, 2025, 11:32 AM IST
Dil Raju: నాలుగో రోజు కొనసాగిన ఐటీ దాడులు..దిల్ రాజు నుండి కీలక పత్రాలు స్వాధీనం..!

Dil Raju IT Raids: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దిల్ రాజు పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది. అయితే ఇటీవల దిల్ రాజు ఇంటనే కాకుండా చాలామంది నిర్మాతల ఇంట కూడా ఐటి అధికారులు ఒక్కసారిగా సోదాలు నిర్వహించారు. 

మంగళవారం రోజు తెల్లవారుజాము నుంచి గురువారం అర్ధరాత్రి వరకు దాదాపు 3 రోజులపాటు ఆయన ఇంట్లో, కార్యాలయాలలో అలాగే తమ కూతురు ఇంట్లో వ్యాపార భాగస్వాములుగా ఉన్న వారి ఇంట కూడా సోదాలు కొనసాగించారట. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైన సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టారు. వచ్చిన కలెక్షన్స్ ఎంత? అనే పూర్తి విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలకు పెట్టుబడి పెట్టడానికి దిల్ రాజు అప్పు తీసుకొచ్చారని, అందుకు సంబంధించిన పలు అంశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. 

దీనికి తోడు దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల పరిశీలన,  బ్యాంకు లాకర్లను తెరిపించి అక్కడ కూడా పూర్తి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అంతేకాదు దిల్ రాజు సోదరుడు విజయ్ సింహా నివాసంలో కూడా సోదాలు నిర్వహించారట. 

ఆటోమొబైల్ ఫీల్డ్ లో ఉన్న విజయ్ సింహ రెడ్డి తన అన్నయ్య దిల్ రాజు మధ్య ఏదైనా లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దిల్ రాజు నివాసంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అధికారులు పూర్తి సమాచారంతోనే రైడ్ నిర్వహించారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

ఇకపోతే దిల్ రాజు ఇంట్లోనే కాదు పలువురు బడా నిర్మాతల ఇళ్లల్లో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. పుష్ప 2 సినిమాతో ఏకంగా రూ.1850 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మైత్రి మూవీ మేకర్స్ చూపించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లతో పాటు పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు.

Also Read: Amazon Investment: మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు.. అమెజాన్ అడ్డాాగా తెలంగాణ

Also Read: PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News