Balakrishna vs Chiranjeevi: పోస్టర్ల కలకలం..సింగిల్ హ్యాండ్ తో బాలయ్య స్వైర విహారం..చిరంజీవికి కౌంటరా?

Veera Simha Reddy Posters War in Tollywood: నందమూరి బాలకృష్ణకి హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి హిట్లుగా నిలవగా ఇప్పుడు పోస్టర్ వార్ కలకలం రేపుతోంది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 19, 2023, 03:48 PM IST
Balakrishna vs Chiranjeevi: పోస్టర్ల కలకలం..సింగిల్ హ్యాండ్ తో బాలయ్య స్వైర విహారం..చిరంజీవికి కౌంటరా?

Balakrishna vs Chiranjeevi Posters War: ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణకి హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేయగా మెగాస్టార్ చిరంజీవి సినిమాని బాబి డైరెక్ట్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు ఒకరోజు వ్యవధిలో రిలీజ్ అయ్యి రెండు హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

ఈ రెండు సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే మెగాస్టార్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఉండడం ఆ సినిమాకి బాగా కలిసి వచ్చింది. వీర సింహారెడ్డి కలెక్షన్స్ తో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే తాజాగా వీర సింహారెడ్డి 100 రోజుల కలెక్షన్స్ గ్రాండ్గా చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించింది.

Also Read: Rajamouli Marriage: మా అమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందే మా ఇంటికి వచ్చేవాడు..రాజమౌళి సీక్రెట్స్ బయటపెట్టిన కొడుకు!

ఈ నెలలో మరికొద్దిరోజుల్లో ఈ ఈవెంట్ నిర్వహనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని పోస్టర్లు కలకలం రేపాయి. నందమూరి బాలకృష్ణ రోరింగ్ బ్లాక్ బస్టర్ హండ్రెడ్ డేస్ అనే పోస్టర్ మీద సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అంటే 100 రోజులు సింగిల్ హ్యాండ్ తో సినిమాని ఆడించాడు అని అర్థం వచ్చేలా పోస్టర్లు ప్రచురించడం కలకలం రేపింది. కచ్చితంగా చిరంజీవి రవితేజ కలిసి నటించిన వాల్తేరు వేరే సినిమాకి కౌంటర్ గానే పోస్టర్లు ముద్రించారు అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక వివాదం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఈ పోస్టర్లు ప్రచురించారో అక్కడక్కడ ఈ పోస్టర్ లు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు వీరసింహారెడ్డి ఇటు వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఐటీ దాడులు కలకలం రేపుతున్న క్రమంలో ఇదొక తలనొప్పి వచ్చి పడిందంటూ సదరు ప్రొడక్షన్ హౌస్ ఎగ్జిక్యూటివ్ లు బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అటు బాలయ్య అభిమానులు, ఇటు చిరంజీవి అభిమానులు ఎక్కడ వివాదాలకు కారణమవుతారో అనే ఉద్దేశంతో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సదరు పోస్టర్లను తొలగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది, చూడాలి ఇది ఎంతవరకు వెళ్లబోతోంది అనేది. 

Also Read: Chiranjeevi Gesture: మరోసారి మంచిమనసు చాటుకున్న చిరు..బలగం మొగిలయ్య 'కళ్ల'కి అండగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News