Jr NTR: ఎన్టీఆర్ వార్ 2 గురించి ఆసక్తికరమైన అప్డేట్.. క్రేజీ యాక్షన్ సన్నివేశం లో తారక్..

War 2 Update: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా యాక్టర్ గాm. మారిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా.. నటిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్.. కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 24, 2024, 08:27 PM IST
Jr NTR: ఎన్టీఆర్ వార్ 2 గురించి ఆసక్తికరమైన అప్డేట్.. క్రేజీ యాక్షన్ సన్నివేశం లో తారక్..

War 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్.. సినిమా తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో ప్రేక్షకుల మందికి రాబోతున్న.. సినిమా ఇది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతోంది. 

సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ప్రీ పోన్ అయ్యి ఇప్పుడు ఆగస్టు విడుదలకి సిద్ధం అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ ఆల్రెడీ.. బాలీవుడ్ లో ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే.. ఐదు సినిమాలు విడుదలై మంచి విజయాలు సాధించాయి. 

తాజాగా ఇప్పుడు అందులోని ఆరవ భాగంగా.. విడుదల కాబోతున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు.. ఎన్టీఆర్ రెండవ హీరోగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక రా-ఏజెంట్ గా కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఈ సినిమాలో ఒక స్పీడ్ బోట్ చేజ్.. సన్నివేశం ఉండబోతుందట. దానికోసం భారీ బడ్జెట్ కూడా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. 6 రోజులపాటు ఎన్టీఆర్ ఈ సన్నివేశం షూటింగ్లో పాల్గొన్నారు. టాంబ్ రైడర్, వన్ పీస్, రెసిడెంట్ ఈవిల్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కొరియోగ్రాఫ్ చేసిన.. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఫ్రాన్స్ స్పిల్ హౌస్ ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. సినిమాలో ఒక ట్రైన్ చేజ్ సీన్ కూడా ఉండబోతుందట. 

షూటింగ్ సమయంలో.. ఎలాంటి ఇబ్బందులు, ఆక్సిడెంట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర బృందం ఈ ఇంటెన్స్ ఆక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేసిందట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ కి పూర్తి అవుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: KTR: ఎమ్మెల్యేల జంప్‌ జిలానీలపై కేటీఆర్‌ సంచలన ట్వీట్‌.. మాస్‌ వార్నింగ్‌

Also Read: Sanjay Kumar: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఐదో వికెట్‌ డౌన్‌.. కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News