Inter students got married at Bus Stop in Tamilnadu: తల్లి దండ్రులు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అందుకే తమ పిల్లలను ఎంత కష్టమైనా.. ఇష్టంగా చదివిస్తారు. స్కూల్, కాలేజీ ఫీజలు భారమైనా సరే.. అన్నింటిని భరిస్తూ చదివిస్తుంటారు. కానీ కొంతమందిని పిల్లలు చదువుకోకుండా.. పెడదారి పడుతుంటారు. తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేస్తుంటారు. తాజాగా ఓ ఇద్దరు విద్యార్థులు తమ తల్లిదండ్రులు సమాజంలో కనీసం తలెత్తుకొని తిరగలేని పరిస్థితి తీసుకొస్తున్నారు.
ఇంటర్ చదువుతున్న విద్యార్థులు బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులో కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లా చిదంబరం పరిసర గ్రామాలకు వెళ్లేందుకు గాంధీ విగ్రహం దగ్గర ఓ మినీ బస్ స్టాప్ ఉంది. ప్రయాణికుల కోసం అక్కడ ఓ బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇదే బస్టాండ్‌లో చిదంబరం పరిసర గ్రామాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చిదంబరం సమీపంలోని పెరంబటు పంచాయతీ వెంగాయతలమేడు గ్రామానికి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని, చిదంబరం సమీపంలోని వడకరిరాజపురం గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి (అరుణ్ కుమార్) గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకు స్నేహితులు కూడా సహకరించారు. బస్టాప్‌లో అరుణ్ తన ప్రేయసి మెడలో పసుపు తాడు కట్టాడు. ఈ సమయంలో విద్యార్థిని చిరునవ్వు నవ్వుతూ.. సిగ్గుతో ముఖాన్ని దాచుకుంది. అక్కడున్న విద్యార్థులు వారిపై పువ్వులు చల్లి శుభాకాంక్షలు చెప్పారు.
காலேஜ் மாணவிகள் பரவாயில்லை ஆனால் பள்ளி மாணவிகள் நிலை மோசம் ஆகிரது பெற்றோர்கள் மாணவிகளின் ஸ்கூல் பேக் & மொபைலை பெற்றோர்கள் கண்காணிக்கவும்😭😭😭 pic.twitter.com/BUdtkbCGVq
— SP Chhandak (@CHHANDAK175) October 10, 2022
ఇంటర్ విద్యార్థులు బస్టాండ్‌లో పెళ్లి చేసుకుంటుండగా తోటి విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియోపై చిదంబరం నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులను ధిక్కరించి తాళి కట్టుకునే ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాద్యత లేని విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.
Also Read: T20 World Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మల్టీప్లెక్స్‌ల్లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల లైవ్..
Also Read: Today Gold rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook