Bigg Boss Telugu 6 Elimination: ఆ ఇద్దరు భామల మీద ఎలిమినేషన్ కత్తి..ఒకరు కన్ఫాం!

Inaya Sultana Or Arohi Rao Likely To Be Eliminated in First Week: బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం ఎలిమినేషన్ దగ్గర పడింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 10, 2022, 10:09 AM IST
 Bigg Boss Telugu 6 Elimination: ఆ ఇద్దరు భామల మీద ఎలిమినేషన్ కత్తి..ఒకరు కన్ఫాం!

Inaya Sultana Or Arohi Rao Likely To Be Eliminated in First Week: బిగ్ బాస్ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నాయి. ఇప్పటికే మొదటి వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ కూడా జరిగాయి. తొలి వారం నామినేషన్స్ లో ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. వాస్తవానికి ప్రతి సీజన్లో హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజే నామినేషన్స్ పంచాయతీ పెట్టే వాళ్ళు. కానీ ఈ సారి కాస్త భిన్నంగా రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నామినేషన్స్ పెట్టారు.

ఈ వారం ఎలిమినేషన్ కోసం ఏడుగురు సభ్యులు నామినేట్ అవ్వగా వారిలో ఇనయా సుల్తానా, అభినయశ్రీ, ఫైమా, శ్రీ సత్య, ఆరోహి రావు, చలాకీ చంటి, సింగర్ రేవంత్ ఉన్నారు. ఇక నిన్న అర్ధరాత్రితో ఈ బిగ్ బాస్ ఓటింగ్ ముగిసింది. ఈ ఏడుగురిలో మొదటి వారంలో ఒకరు బయటకు రాబోతున్నారు. అయితే ఓటింగ్ ప్రకారం టాప్ సిక్స్ లో నిలిచిన వారికి హౌస్ లోపల ఉండే అవకాశం ఉంటుంది. అతి తక్కువ ఓట్లు దక్కించుకుని ఏడవ స్థానంలో నిలిచిన కంటెంట్ బయటకు రాక తప్పదు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయం మీద మాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఆరో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తోంది. మొదటి స్థానం కోసం ఫైమా, రేవంత్ గట్టిగా పోటీపడ్డారని తెలుస్తోంది. అయితే వీళ్ళ అభిమానులు గట్టిగా ఓటింగ్ లో పాల్గొంటూ ఉండటంతో తరచూ వీరి స్థానాలు మారుతున్నాయని అంటున్నారు. అయితే ఓటింగ్ ముగిసే సమయానికి రేవంత్ టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అలాగే ఫైమా రెండవ స్థానంలో ఉండగా, మూడో స్థానంలో శ్రీ సత్య నాలుగో స్థానంలో చలాకీ చంటి, ఐదవ స్థానంలో అభినయ శ్రీ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆరు ఏడు స్థానాల్లో ఆరోహి, ఇనయా సుల్తానా ఉన్నారు.

వారిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆరోహి ఒక ప్రముఖ ఛానల్ లో పని చేస్తూ ఉండడంతో ఆ ఛానల్ సపోర్ట్ తో పాటు తాను అనాధని అని చెప్పుకుంటూ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు కూడా ప్రేక్షకులు ఆమె మీద సింపతీ ఏర్పాటయ్యేలా చేశాయని అంటున్నారు. ఆమెకు కాస్త ఎక్కువగానే ఓట్లు పడ్డాయి అంటున్నారు. ఫైనల్ గా ఇనయా సుల్తానా మొదటి వారమే హౌస్ లో నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: RC 16 with Narathan: ప్రశాంత్ నీల్ శిష్యుడితో రామ్ చరణ్ మూవీ.. ఆ బ్లాక్ బస్టర్ తరువాత ఇదే!

Also Read: Galatta Geetu Behaviour: టీషర్టు లోపల చెయ్యి పెట్టుకోండి.. దిగజారి పోతున్న గీతూ ప్రవర్తన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News