Ilayaraja Daughter: ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో కూతురు మృతి

Ilayaraja Daughter Death News: ఇళయరాజా కుమార్తె, సింగర్ భవతారిణి (47) క్యాన్సర్‌తో బాధపడుతూ నేడు కన్నుమూశారు.  ఆయుర్వేద వైద్యం కోసం శ్రీలంకకు తీసుకెళ్లగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. దాదాపు 30కి పైగా సినిమాల్లో పాటలు పాడి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 25, 2024, 09:06 PM IST
Ilayaraja Daughter: ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో కూతురు మృతి

Ilayaraja Daughter Death News: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా కుమార్తె, సింగర్ భవతారిణి ఈరోజు సాయంత్రం శ్రీలంకలో కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతున్న తుది శ్వాస విడిచారు. ఆయుర్వేద వైద్యం కోసం శ్రీలంకకు తీసుకెళ్లగా.. నేడు సాయంత్రం 5.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆమె వయసు 47 ఏళ్లు. భవతారిణి మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో ఎన్నో పాటలు పాడిన ఆమె గుర్తింపు పొందారు. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె గాయనిగా అరంగేట్రం చేశారు.

Trending News