గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు

గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలీవూడ్ నటి శ్రీదేవి 'ఇఫీ' పనోరమా విభాగాన్ని ప్రారంభించారు.

Last Updated : Nov 23, 2017, 01:50 PM IST
గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు

గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలీవూడ్ నటి శ్రీదేవి 'ఇఫీ' పనోరమా విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  ప్రపంచంలో గొప్ప చిత్రోత్సవాల్లో 'ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా- ఐఎఫ్ఎఫ్ఐ)' ఒకటని ఆమె పేర్కొన్నారు. పనోరమ విభాగంలో ఫీచర్ లో 26, నాన్ ఫీచర్ విభాగంలో 16 చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఫీచర్ విభాగంలో భారత్ నుండి ఆస్కార్ కు నామినేట్ అయిన 'న్యూటన్' చిత్రం తో పాటు 'బాహుబలి: ది కంక్లూజన్', 'జూలీ ఎల్ ఎల్ బి 2' తదితర చిత్రాలను ప్రదర్శిస్తారు. వినోద్ కఫ్రీ డైరెక్షన్లో వచ్చిన హిందీ చిత్రం 'పిహూ' ఫీచర్ విభాగంలో, 'పుష్కర్ పురాన్' నాన్ ఫీచర్ విభాగంలో ఆరంభ చిత్రాలుగా ప్రదర్శించారు.

Trending News