Tollywood films muhurthams: ముహూర్తాల టెన్షన్..ఒకేరోజు డజను సినిమాల ఓపెనింగ్

Huge Number of Tollywood films had muhurtham today: మరో మూడు నెలల పాటు సరైన ముహూర్తాలు లేకపోవడంతో 22వ తేదీ ఆగస్టు అంటే ఈ రోజు దాదాపు 12 సినిమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2022, 05:11 PM IST
Tollywood films muhurthams: ముహూర్తాల టెన్షన్..ఒకేరోజు డజను సినిమాల ఓపెనింగ్

Huge Number of Tollywood films had muhurtham today: టాలీవుడ్ దర్శక నిర్మాతలు ముహూర్త బలాన్ని చాలా నమ్ముతూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే మరో మూడు నెలల పాటు సరైన ముహూర్తాలు లేకపోవడంతో 22వ తేదీ ఆగస్టు అంటే ఈ రోజు దాదాపు 12 సినిమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా పుష్ప సినిమా గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. పుష్ప 2 సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

మొదటి భాగానికి మైత్రీ మూవీ మేకర్స్ కు సహనిర్మాణ సంస్థగా వ్యవహరించిన మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంస్థ ఈ రెండో భాగంలో నిర్మాణ భాగస్వామ్యం పంచుకోవడం లేదు.  దాని స్థానంలో సుకుమార్ రైటింగ్స్ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా యధా రాజా తథా ప్రజా అనే సినిమా కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో సినిమా బండి ఫేమ్ వికాస్ మరో హీరోగా నటిస్తున్నారు. సృష్టి వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఈ సినిమాను ఓం మూవీ క్రియేషన్స్ శ్రీకృష్ణ మూవీ క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక అల్లరి నరేష్ నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్ లో ఉగ్రం అనే సినిమా కూడా ప్రారంభమైంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక మరో పక్క శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద పలు ఆసక్తికరమైన సినిమాలు తెరకెక్కించిన సుధాకర్ చెరుకూరి నాగశౌర్య హీరోగా పవన్ భాసంశెట్టి అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా యుక్తి తరేజ నటిస్తోంది. ఇక ఇవి కాక చిన్నా చితకా అన్నీ మొత్తం 12 సినిమాల ఓపెనింగ్స్ జరిగాయి. 
Also Read: Liger Movie Pre Release Business: షాకిచ్చేలా లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ కెరీర్ హయ్యెస్ట్!

Also Read: Pushpa the Rule Movie: సుకుమార్ బడా ప్లాన్.. వాళ్లని దూరం పెట్టిన అల్లు అర్జున్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News