Jr NTR Birthday : ఎన్టీఆర్‌కు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి విషెస్.. మిత్రమా అంటూ హృతిక్.. చిరు, మహేష్‌ ఇలా

Jr NTR Birthday ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా ఎన్టీఆర్‌కు విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. చిరంజీవి, మహేష్‌ బాబు, అల్లు అర్జున్ వంటి వారంతా కూడా విషెస్ అందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2023, 04:33 PM IST
  • నెట్టింట్లో యంగ్ టైగర్ ఫ్యాన్స్ సందడి
  • ఎన్టీఆర్‌కు విషెస్‌ల వెల్లువ
  • హృతిక్, ఎన్టీఆర్‌ల ట్వీట్లు వైరల్
Jr NTR Birthday : ఎన్టీఆర్‌కు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి విషెస్..  మిత్రమా అంటూ హృతిక్.. చిరు, మహేష్‌ ఇలా

Jr NTR Birthday యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20) సందర్భంగా సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల హవా కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియా ఎన్టీఆర్‌కు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ ఇలా అన్ని చోట్ల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ నుంచి హృతిక్ వేసిన ట్వీట్, చిరు, మహేష్‌ బాబు, బన్నీ అందించిన విషెస్ వైరల్ అవుతున్నాయి.

హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.. మున్ముందు ఏడాది అంతా నీకు బాగుండాలి..యుద్దభూమిలో మనం ఎప్పుడు కలుస్తామా? అని ఎదురుచూస్తున్నా.. మనం కలిసే వరకు సంతోషంగా, ప్రశాంతంగా ఉండు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అని హృతిక్ రోషన్ విషెస్ చెప్పాడు. దానికి ఎన్టీఆర్ ఇలా రిప్లై ఇచ్చాడు. నీ విషెస్‌లో తడిసి ముద్దయ్యాను.. నువ్ కూడా రోజులు లెక్క పెట్టుకో..  యుద్ధభూమిలో ఏం జరుగుతుందా? అని మీరు ఆలోచిస్తూ ఉంటారేమో.. ఇప్పుడు బాగా విశ్రాంతి తీసుకోండి అంటూ ఎన్టీఆర్ స్పందించాడు.

హ్యాపీ బర్త్ డే బావ.. బర్త్ డేను బాగా సెలెబ్రేట్ చేసుకుంటావని ఆశిస్తున్నా అని బన్నీ ట్వీట్ వేశాడు. హ్యాపీ బర్త్ డే తారక్.. మున్ముందు నీకు మరిన్ని మంచి విజయాలు దక్కాలి అని మహేష్‌ బాబు కోరాడు. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.. టాలెంట్‌ గనివి నువ్వు.. సంతోషంగా ఉండాలి.. విజయాలు చేకూరాలి అని చిరంజీవి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చాడు.

Also Read:  NTR Centenery Celebrations : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు యంగ్ టైగర్ దూరం.. రాత్రికి రాత్రే ఏం జరిగింది?

ఇక హీరోయిన్లంతా కూడా ఎన్టీఆర్‌కు విషెస్ చెబుతున్నారు. కాజల్, రకుల్, కుష్బూ ఇలా ఎన్టీఆర్‌కు విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా సెలెబ్రిటీలంతా కూడా యంగ్ టైగర్‌కు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.

Also Read:  Bandla Ganesh Devara : నా టైటిల్ కొట్టేశారు.. ఎన్టీఆర్ దేవరపై బండ్ల గణేష్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News