Hrithik Roshan, Saba Azad: వీళ్లిద్దరి యవ్వారం ఇంతదాకా వచ్చిందే

Hrithik Roshan, Saba Azad Relationship: కొంతమంది సెలబ్రిటీలు డైవర్స్‌ తర్వాత తమ లైఫ్‌ను మరో రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. డైవర్స్ తీసుకున్నామన్న బాధను దిగమింగుకొని.. కొత్త లైఫ్ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్​లో ఈ కల్చర్​ ఎక్కువనే చెప్పవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 12:10 AM IST
  • పబ్లిగ్గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్న బాలీవుడ్ లవ్ కపుల్
  • భార్యకు విడాకులిచ్చి మరో యంగ్ హీరోయిన్‌తో హీరో షికార్లు
  • జంటగానే పదే పదే మీడియా ముందుకొస్తున్న వైనం
Hrithik Roshan, Saba Azad: వీళ్లిద్దరి యవ్వారం ఇంతదాకా వచ్చిందే

Hrithik Roshan, Saba Azad Relationship Updates: కొంతమంది సెలబ్రిటీలు డైవర్స్‌ తర్వాత తమ లైఫ్‌ను మరో రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. డైవర్స్ తీసుకున్నామన్న బాధను దిగమింగుకొని.. కొత్త లైఫ్ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్​లో ఈ కల్చర్​ ఎక్కువనే చెప్పవచ్చు. ఈ కోవలోకే వస్తారు ​బాలీవుడ్ స్టార్​ హృతిక్​ రోషన్. ​హీరోయిన్​ సబా ఆజాద్​తో ఆయన లవ్ ట్రాక్ సాగిస్తున్నట్లు బాలీవుడ్ టౌన్​లో పుకార్లు షికార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ముంబై ఎయిర్​పోర్ట్‌లో ఇరువురు చేతిలో చేయి వేసి కెమెరాలకు కనిపించడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. 

బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్, యువ హీరోయిన్​ సబా ఆజాద్​పై బాలీవుడ్ టౌన్​లో అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్​షిప్​పై ఇప్పటివరకు చాలాసార్లు ఊహాగానాలు వెలువడ్డాయి. సబా ఆజాద్, హృతిక్​ రోషన్​ కలిసి పలు హోటళ్లు, రెస్టారెంట్​లకు వెళుతూ.. ఇప్పటికే అనేకసార్లు కెమెరా కంటికి చిక్కారు. తాజాగా మరోసారి ఈ జంట ముంబై ఎయిర్​పోర్ట్‌లో మీడియాకు చిక్కారు. 

హృతిక్ తెల్లటి టీ-షర్ట్, డెనిమ్ ప్యాంట్‌లో ఉండగా.. వైట్ స్నీకర్స్‌లో సబా ఆజాద్ చేతిలో చేయి వేసుకొని ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాకు దొరికిపోయారు. దీంతో ఇద్దరి మధ్య రిలేషన్​షిప్​ కచ్చితంగా ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో వీరిద్దరికి వివాహం కాబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల హృతిక్ రోషన్ (Hrithik Roshan)​ ఇంటికి.. సబా ఆజాద్ విందుకు రావడం జనం కంటపడకుండా పోలేదు. ఇంకేం.. ఇవన్నీ చూస్తోంటే.. వీళ్లిద్దరూ త్వరలోనే ఒకింటి వారు కావడం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

Also read : Aamir Khan And Kiran Rao Divorce: ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ నుంచి అర్బాజ్, మలైకా అరోరా వరకు బాలీవుడ్‌లో షాకింగ్‌ విడాకులు ఇవి

Also read : Bollywood celebrities Private jets photos: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. వారి ప్రైవేట్ జెట్ విమానాల ఫోటోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News