HCA Awards: హెచ్‌సీఏ దిద్దుబాటు చర్యలు, జూనియర్‌కు అవార్డు ఇస్తున్నట్టు ప్రకటన

HCA Awards: ఆర్ఆర్ఆర్ సినిమా విషయమై వార్తల్లో విన్పించిన హెచ్‌సీఏ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చిన విమర్శలకు భయపడి జూనియర్ ఎన్టీఆర్‌కు అవార్డు పంపిస్తున్నట్టు ప్రకటించింది. అసలేం జరిగిందంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2023, 05:23 PM IST
HCA Awards: హెచ్‌సీఏ దిద్దుబాటు చర్యలు, జూనియర్‌కు అవార్డు ఇస్తున్నట్టు ప్రకటన

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులకు అంతర్జాతీయ రంగంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు 5 కేటగరీల్లో అవార్డులు ప్రకటించి..జూనియర్ ఎన్టీఆర్‌ను  పట్టించుకోలేదు. ఇది కాస్తా తీవ్ర విమర్శలకు దారి తీసింది. 

ఆర్ఆర్ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడం ఆ తరువాత ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కావడం తెలిసిందే. ఈ రెండు కీలక పరిణామాల తరువాత ప్రముఖ అంతర్జాతీయ సంస్థ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష,న్ ఆర్ఆర్ఆర్ సినిమాకు 5 విభిన్న కేటగరీల్లో అవార్డులు ప్రకటించింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలైన బ్లాక్ పాంథర్, బ్యాట్‌మ్యాన్, ది విమెన్ కింగ్, టాప్ గన్ మేవరిక్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఆర్ఆర్ఆర్..హెచ్‌సీఏ అవార్డులు దక్కించుకుంది. ఈ అవార్డు ప్రదానోత్సం ఇటీవలే జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, హీరో రామ్‌చరణ్, ఎంఎం కీరవాణి, సెంథిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. అయితే హెచ్‌సీఏ సంస్ధ రామ్‌చరణ్‌కు అవార్డు ఇచ్చి..జూనియర్ ఎన్టీఆర్‌ను మర్చిపోయినట్టుంది. దాంతో హెచ్‌సీఏ నిర్వాహకులపై భారీగా విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్దఎత్తున కామెంట్లు చేశారు. 

దాంతో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అలియా భట్‌కు అవార్డులు పంపిస్తున్నామని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

వీరి అవార్డుల్ని వచ్చేవారం నేరుగా వారికే పంపిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఈ ఇద్దరి పేర్లతో ఉన్న అవార్డుల్ని షేర్ చేసింది. వాస్తవానికి అవార్డు  ప్రదానోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించామని..వ్యక్తిగత కారణాలతో రాలేదని హెచ్‌సీఏ తెలిపింది. 

Also read: Megha Akash : మేఘా ఆకాశ్ ఇంట్లో విషాదం.. నువ్ లేకుండా ఎలా బతకాలో తెలీదంటూ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News