HCA Clarity on Jr NTR issue: ఎన్టీఆర్ పై కుట్ర..పిలిచాం కానీ రాలేదంటూ హెచ్సీఏ షాకింగ్ ట్వీట్!

HCA Clarity on Jr NTR: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ను పిలవకపోవడం ఆ తరువాత జరుగుతున్న రచ్చ విషయంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పందించింది, ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 28, 2023, 12:49 PM IST
HCA Clarity on Jr NTR issue: ఎన్టీఆర్ పై కుట్ర..పిలిచాం కానీ రాలేదంటూ హెచ్సీఏ షాకింగ్ ట్వీట్!

Hollywood Critics Association Clarity on Inviting Jr NTR: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానుల మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ సహా సినీ జనం అందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులో వేడుకకు ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ తేజ మెరిశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకి దాదాపుగా నాలుగు అవార్డులు రాగా నాలుగు అవార్డులు అందుకునేందుకు ఆర్ఆర్ఆర్ టీం నుంచి ఐదుగురు వ్యక్తులు హాజరయ్యారు. వారిలో ఒకరిగా రామ్ చరణ్ ఉన్నారు, అయితే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు రామ్ చరణ్ చేతుల మీదుగా కొన్ని అవార్డుల అందజేయడం కూడా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అలాగే ఇండియన్ సినిమా గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.

ఇక తరువాత ఇది రామ్ చరణ్ ఘనత అన్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్లు చేయడం తర్వాత మరికొంతమంది రామ్ చరణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఇదేమి నచ్చని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావాలనే తమ హీరోని దూరం పెట్టారంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. కావాలనే ఇద్దరు హీరోలలో రామ్ చరణ్ ని మాత్రమే హైలైట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారు అన్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయం మీద తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్ని కూడా ట్యాగ్ చేస్తూ ఇదంతా మెగా పెయిడ్ మాఫియా చేస్తున్న వ్యవహారం అంటూ ట్రోల్ చేసిన పరిస్థితి కనిపించింది. హెచ్సీఏ మెంబర్ మోనిక రామ్ చరణ్ తో ఫోటో దిగి సంబరపడుతూ ఆ ఉత్సుకత ఆపుకోలేక రామ్ చరణ్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ పెయిడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు, మెగా అభిమానుల్లో ఒకరి పేరును మెన్షన్ చేస్తూ కావాలనే వాళ్ళు ఇలా పెయిడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారని కామెంట్ చేయడంతో ట్రోలింగ్ చూసిన మౌనిక ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను, పాజిటివ్ గా ఉన్న విషయాన్ని నెగిటివ్ చేయొద్దు, నేను నా అంతట నేనుగా ఒక విషయాన్ని పోస్ట్ చేశాను, ఎవరూ నాకు డబ్బులు ఇవ్వలేదు అలాగే ఎవరూ నన్ను ఇలా పోస్ట్ చేయమని అడగలేదు. ఆర్ఆర్ఆర్ మీద ఉన్న నా ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇలా నేను పోస్ట్ చేశాను అంతే తప్ప నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా ఫ్యాన్ వార్ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ వ్యవహారం మీద పెదవి విప్పింది. జూనియర్ ఎన్టీఆర్ ని తాము ఈ వేడుకకు పిలిచామని చెబుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఆయన ప్రస్తుతానికి ఇండియాలో ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని అందుకే ఆయన ఈ అవార్డులు వేడుకకు రాలేకపోయారని పేర్కొంది. మా నుంచి ఆయనకు అందాల్సిన అవార్డు త్వరలోనే అందుతుందని పేర్కొంటూ ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాంటి సినిమా షూటింగ్ చేయడం లేదనే విషయం తెలిసిన తెలుగు అభిమానులు మాత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మీద మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని ఆయన పర్సనల్ కారణాలవల్ల రాలేకపోయారు ఆయన సోదరుడు తారకరత్న ఇటీవల చనిపోయారు ఆయన ఎలాంటి షూటింగ్లో లేరు అనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ దానికి కూడా క్లారిటీ ఇచ్చింది. అదేమిటంటే ఆయన ఒక సినిమా షూటింగ్ చేస్తున్నారని అందుకే హాజరు కాలేకపోయారని ఆయన పబ్లిసిస్ట్ మాకు చెప్పాడని, తరువాత ఆయన సోదరుడు కూడా చనిపోవడంతో సినిమా షూటింగ్ కూడా నిలిపివేశారని ఆయన వెల్లడించినట్లుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పేర్కొంది. సో ఇక్కడితో అయినా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాల్సి ఉంది. 

Also Read: Jr NTR Lipo Surgery: బాడీ షేమింగ్ తో ఇబ్బంది పడి ఇండియాస్ బెస్ట్ యాక్టర్ గా నిలబడ్డ ఎన్టీఆర్!

Also Read: HCA Member Monica GLeberman : ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరువుతీసిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్.. ట్రోలింగ్‌పై ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News