Salman Khan Tiger 3: క‌త్రినా కైఫ్‌ టవల్‌ ఫైట్‌ వైరల్.. హాలీవుడ్ నటి మిచ్చెల్ లీ రియాక్షన్ ఇదే..!

Katrina Kaif Towel Fight in Tiger 3: సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 12న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులోని కత్రినా కైఫ్-మిచెల్ లీ టవల్ ఫైట్ తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఫైట్ సీన్ గురించి మిచెల్‌ లీ వివరించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 05:35 PM IST
Salman Khan Tiger 3: క‌త్రినా కైఫ్‌ టవల్‌ ఫైట్‌ వైరల్.. హాలీవుడ్ నటి మిచ్చెల్ లీ రియాక్షన్ ఇదే..!

Katrina Kaif Towel Fight in Tiger 3: స్కార్లెట్ జాన్స‌న్ మూవీ బ్లాక్ విడో, జానీ డెప్ మూవీ పైరెట్స్ ఆఫ్ క‌రేబియ‌న్‌, బ్రాడ్ పిట్ మూవీ బుల్లెట్ ట్రెయిన్, టామ్ హార్డీ మూవీ తదితర హాలీవుడ్ చిత్రాల్లో అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించి మెప్పించింది హాలీవుడ్ న‌టి మిచెల్ లీ. తాజాగా ‘టైగర్ 3’ మూవీలో మరోసారి వావ్ అనిపించే యాక్ష‌న్ సీక్వెన్స్‌లో మెప్పించ‌నుంది. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టించిన యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీ ‘టైగర్ 3’. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌త్రినా, మిచెల్ లీ మ‌ధ్య ఉన్న ట‌వ‌ల్ ఫైట్ సీన్ ఓ స‌న్నివేశంలో చూపించారు. ఈ సీన్ ఇంట‌ర్నెట్‌లో ఎంత వైర‌ల్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ట‌వ‌ల్ ఫైట్ సీన్‌ని ట‌ర్కిష్‌లోని హామామ్‌లో చిత్రీక‌రించారు. 

‘టైగర్ 3’లో చూపించిన ట‌వల్ ఫైట్‌లోని ఓ చిన్న స‌న్నివేశం నెట్టింట వైర‌ల్ కావ‌టంపై మిచెల్ ఆశ్చ‌ర్యపోవ‌టం లేదు. అందుకు కార‌ణం.. క‌త్రినాతో మిచెల్ ఆ ఫైట్ సీన్‌ను ఎలా చేయాలి..? ఎంత కొత్త‌గా చేస్తే ఆడియెన్స్‌కి అది క‌నెక్ట్ అవుతుంద‌నే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ చేసిన‌ట్లు చెప్పుకొచ్చింది. ‘‘కత్రినాతో నేను చేసిన టవల్ ఫైట్‌కి సంబంధించిన  చిన్న స‌న్నివేశం గురించి ఇలా అంద‌రూ మాట్లాడుకోవ‌టంపై నేనేమీ ఆశ్చ‌ర్య‌పోవ‌టం లేదు. దీన్ని చిత్రీక‌రించే స‌మ‌యంలో దీని గురించి అంద‌రూ మాట్లాడుకునేంత డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని న‌మ్మాను. ఈ ఫైట్‌ను చిత్రీక‌రించ‌టానికి ముందు నేను, క‌త్రినా క‌లిసి కొన్ని వారాల పాటు ప్రాక్టీస్ చేశాం. ఆ ఫైట్‌, దాన్ని డిజైన్ చేసిన తీరు అద్భుతం. అందులో న‌టించేట‌ప్పుడు బాగా ఎంజాయ్ చేశాం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌లో దీన్ని రూపొందించారు. క‌త్రినా కైఫ్ గొప్ప న‌టి. ఎంతో ప్రొఫెష‌న‌ల్ ప‌ర్స‌న్‌. ఈ ఫైట్‌లో న‌టించ‌టానికి త‌నెంతో క‌ష్ట‌ప‌డింది. తనతో వ‌ర్క్ చేయ‌టం ఎంతో సులువుగా అనిపించింది.

మేం శరీరాలకు టవల్స్ చుట్టుకుని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో పాల్గొన్నాం. ఇలాంటి యాక్ష‌న్ సీక్వెన్స్ చేయ‌టానికి క‌చ్చిత‌మైన యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అవ‌స‌రం. దాన్ని ఎంతో అందంగా డిజైన్ చేశారు. ఇదొక ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఒక‌రినొక‌రు గాయ‌ప‌రుచుకోకుండా ఓ క‌చ్చిత‌మైన దూరాన్ని పాటిస్తూ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొన‌టం కూడా ఓ ఛాలెంజింగ్ విష‌య‌మే. ఇద్ద‌రం ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి గాయాలు కాలేదు’’ అని ఈ హాలీవుడ్ బ్యూటీ తెలిపింది.

య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ రూపొందిస్తోన్న స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా టైగ‌ర్ 3 సినిమాను ఆదిత్య చోప్రా అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా దీపావ‌ళి సంద‌ర్బంగా న‌వంబ‌ర్ 12న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది.

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు  

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News